logo
తాజా వార్తలు

ఆస్తులు అమ్ముకొనైనా సరే గెలవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

jaggareddy
X
jaggareddy
Highlights

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డిలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పారు. వారి వ్యక్తిగత అవసరాలు సైతం తీరుస్తానని హామీ ఇచ్చారు. దీనికోసం డబ్బులు కావాలని ఆ డబ్బు సంపాదన కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తానని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తన ముందుకు రావాలన్నారు. గెలుపు కోసం ఆస్తులు అమ్మడానికైనా సిద్ధం కావాలన్నారు జగ్గారెడ్డి. గెలుపు కోసం చేసిన ఖర్చుకు డబుల్ అమౌంట్ చెల్లిస్తామని కుడా హామీ ఇచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని జగ్గారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించబోనని మరోసారి స్పష్టం చేశారు.

Next Story