స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ.. అది తెలిసిన మహిళ..

స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ.. అది తెలిసిన మహిళ..
x
Highlights

ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రకరించాడు యువకుడు. ఇక ఆ వీడియోతో ఆ మహిళను ఎలాగైన బెదిరించి లోంగదీసుకోవాలని భావించాడు ఆ...

ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రకరించాడు యువకుడు. ఇక ఆ వీడియోతో ఆ మహిళను ఎలాగైన బెదిరించి లోంగదీసుకోవాలని భావించాడు ఆ యువకుడు. కానీ ఆ యువకుడు వీడియో తీస్తున్న దృశ్యాన్ని చూసిన మహిళ ఇంట్లో వాళ్లకు చెప్పింది. దీంతో వారు పోలీసు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి ఏడాది పాటు జైలు శిక్ష, రూ.10వేల జుర్మానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇక వివరాల్లోకెళితే హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన అవినాష్‌రెడ్డి గత 2014 ఏప్రిల్‌ 19న వీడియో చిత్రికరించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న బాలానగర్‌ పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణ పూర్తిచేసిన అనంతరం న్యాయమూర్తి శ్రీదేవి గురువారం తీర్పు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories