Top
logo

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత
Highlights

ఎన్నికల వేళ రాజధానిలో భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అన్ని చోట్లా...

ఎన్నికల వేళ రాజధానిలో భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అన్ని చోట్లా ప్రత్యేక పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ నారాయణగూడలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా 8 కోట్ల రూపాయలు లభించాయి. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుడు ఈ డబ్బులను తరలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Next Story