మీ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయలేదా? వెంటనే చేయకపోతే డీయాక్టివేషన్ ఖాయం!


Haven’t Updated Your Child’s Aadhaar Biometrics Yet? Immediate Action Needed to Avoid Deactivation!
7 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే UIDAI డీయాక్టివేట్ చేస్తుంది. ఆధార్ ఎలా అప్‌డేట్ చేయాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
UIDAI కొత్తగా కీలక హెచ్చరికను జారీ చేసింది. 7 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ కార్డులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయని పక్షంలో వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసే అవకాశముందని స్పష్టం చేసింది. 5 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలకు జారీ చేసిన ఆధార్‌ను 7 సంవత్సరాలు వచ్చేలోపు తప్పనిసరిగా బయోమెట్రిక్ సమాచారం సహా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని వివరించింది.
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు అవసరం?
పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ జారీ చేసినప్పుడు, వారి పూర్తి బయోమెట్రిక్ వివరాలు (ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్) తీసుకోరు. అప్పుడు వారి శరీర వృద్ధి పూర్తిగా ఉండదు. కానీ 7 ఏళ్లకు పైగా వచ్చిన తరువాత స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, డీబీటీ ప్రయోజనాలు వంటి సేవల కోసం ఆధార్ అవసరమవుతుంది. ఈ సమయంలో పూర్తి బయోమెట్రిక్ వివరాలు లేని ఆధార్ నిల్వ ఉండదు. అందుకే UIDAI నుంచి ఈ అప్డేట్ తప్పనిసరి అయింది.
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ ఎలా అప్‌డేట్ చేయాలి?
- మీకు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం (Aadhaar Seva Kendra) కు పిల్లలతో వెళ్లాలి.
- పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్‌లను అక్కడ అప్డేట్ చేస్తారు.
- 5-7 ఏళ్ల వయస్సులో ఫస్ట్ టైమ్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం.
- 7 ఏళ్ల తర్వాత ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ₹100 చెల్లించాల్సి ఉంటుంది.
- 15–17 ఏళ్ల మధ్య రెండో అప్డేట్ చేయాలంటే మరోసారి ఉచితమే.
అవసరమైన డాక్యుమెంట్లు:
- పుట్టిన తేదీ నిర్థారణకు జనన ధృవీకరణ పత్రం
- స్కూల్ ఐడీ కార్డ్
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు
ఎందుకు తీసుకోవాలి ఈ జాగ్రత్త?
UIDAI ప్రకారం, పిల్లల ఆధార్ లో బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే, వారి ఆధార్ సేవలు నిలిపివేయబడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం పంపుతోంది. వెంటనే ఆధార్ అప్డేట్ చేయడం ద్వారా మీరు మీ పిల్లల సేవలపై ప్రభావం రాకుండా చూడొచ్చు.
- Aadhaar update for children
- Aadhaar biometric update
- UIDAI Aadhaar deactivation warning
- Aadhaar for kids
- Aadhaar Seva Kendra
- Aadhaar update age limit
- child Aadhaar card
- Aadhaar OTP update
- biometric update process
- documents for Aadhaar update
- Aadhaar age 5-7 update
- Aadhaar mandatory update
- Aadhaar services deactivation
- Aadhaar update fees
- Aadhaar free update

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



