ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Secunderabad: బోనాల పండుగకు చాలా గొప్ప చరిత్ర ఉందన్నారు

Sriveni Erugu
Published on: 19 July 2022 6:45 AM IST
Governor Tamilisai visited Goddess Mahankali in Ujjain
X

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్ దర్శించుకున్నారు. ఆ తర్వాత బోనాలపండుగ చరిత్రను పూజారులను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు గవర్నర్. తెలంగాణ ప్రజలు దేవతలందరినీ అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారని తెలిపారు. బోనాల పండుగకు చాలా గొప్ప చరిత్ర ఉందన్నారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుందన్నారు. కరోనా మహమ్మారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలందరూ బూస్టర్‌ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని విజ్జప్తి చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story