అర్ధరాత్రి 2 దాటిందంటే... అక్కడ భయంతో బెంబేలెత్తిపోతున్నారు..

అర్ధరాత్రి 2  దాటిందంటే... అక్కడ భయంతో బెంబేలెత్తిపోతున్నారు..
x
Highlights

"ధైయ్యం.. భయంతో వాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. అక్కడి నుండి వచ్చే శబ్ధలతో వారికి ముచ్చెమటలు...

"ధైయ్యం.. భయంతో వాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. అక్కడి నుండి వచ్చే శబ్ధలతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. భయం వారిని వెంటాడుతోంది. అయితే ఇదంతా ఏ సినీమాలో కథ అనుకుంటున్నారా? కాదు నమ్మలేని నిజం అని అంటున్నారు దేశ రాజధాని దిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నా మహిళ ఖైదీలే స్వయంగా చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. దిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు మహిళలు.. వివిధ నేరాల్లో పడిన శిక్ష కారణంగా జైల్లో నాలుగు గోడల మధ్య బంధీలుగా ఉంటున్నారు. అయితే వారు ఇన్నిరోజులుగా లేని భయం వారిలో కనిపిస్తో్ంది. ఎందుకంటే గతంలో ఎన్నడు లేనంతాగా అర్ధరాత్రి 2గంటల సమయంలో బ్యారక్ నంబర్ 6 నుండి అదే పనిగా ఒకటే ఏడుపులు, ఆర్తనాదాలు... తెల్ల చీర కట్టుకొని అటు ఇటు కదిలే ఆకారం వారిని నిద్రపట్టనివ్వలేడం లేదట.

అయితే అసలు విషయానికి వోస్తే ఆ బ్యారక్ లో ఒక మహిళ ఖైదీ ఉరేసుకుందని... ప్రస్తుతం తన ఆత్మ అక్కడే రోజూ అర్థరాత్రి సంచరిస్తోందని.. రోజూ ఏడుస్తూ, ములుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు ఆ నలుగురు మహిళ ఖైదీలు. అయితే రోజూ ఆ నలుగురు ఆ ధైయ్యం గురించే తమలో తాము చెప్పుకుంటే లాభం లేదని అక్కడ ఉండే జైలు అధికారులకు అసలు విషయం చెప్పారు. ఎలాగైన తామకు ఆ సమస్యను ఛేదించి తమకు మనసిక ప్రశాంతతను కల్గించాలని ఆ మ‎హిళా ఖైదీలు వేడుకుంటున్నారు. అయితే జైలు అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వారు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ క్రమంలోనే ఈ కథనంపై ఓ రెంజ్‌లో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రపంచం మొత్తం టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా ఈ కాలంలో ఇంకా ధైయ్యాలు, బూతాలు ఏంటి అని అంటున్నారు. ఇంక మరికొందరైతే అసలు మనిషి మరణం తరువాత ఆత్మల సంచారం అనేదే ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories