పండుగ షాపింగ్‌తో కిటకిటలాడుతోన్న వస్త్ర దుకాణాలు

పండుగ షాపింగ్‌తో కిటకిటలాడుతోన్న వస్త్ర దుకాణాలు
x
Highlights

కొత్తబట్టలు.. పిండి వంటలు.. ముచ్చటైన ముగ్గులు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లు సంబరాల్లో మునిగిపోతాయి.

కొత్తబట్టలు.. పిండి వంటలు.. ముచ్చటైన ముగ్గులు. ఇలా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లు సంబరాల్లో మునిగిపోతాయి. పెద్ద పండుగకు కొత్త బట్టలు కొనాల్సిందే. దీనికి తగ్గట్టు వస్త్రవ్యాపారులూ స్పెషల్ డిస్కౌంట్స్ తో ఆకట్టుకుంటారు. సంక్రాంతి నేపథ్యంలో ఫెస్టివల్ షాపింగ్ ఎలా సాగుతోంది. ఓ లుక్కేద్దాం.

సంక్రాంతి పండుగ అంటేనే సంబరాలకు చిరునామా. కొత్త అల్లుల సందడితో పాటు బంధుమిత్రులు రాకతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పేద గొప్ప అనే తేడా లేకుండా జరుపుకునే ఈ పండుగకు కొత్త బట్టలు కొనాల్సిందే. దీంతో షాపింగ్ మాల్స్ కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా.. వస్త్ర దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి స్పెషల్ ఆఫర్లు పెడుతున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తున్నారు. కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు షాపులకు రంగురంగుల విద్యుత్ దీపాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. పండుగకు వచ్చే అల్లులకు, పిల్లలకు సైతం బట్టలు కొంటున్నామని చెబుతున్నారు. సంవత్సరంలో ఎప్పుడు షాపింగ్ చేయని వారు కూడా సంక్రాంతి టైంలో బట్టలు కొనుగోలు చేస్తారు. అందుకే సంక్రాంతి వచ్చిదంటే వస్త్ర దుకాణాలు కూడా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories