Etela Rajender: ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల భేటీ

Etela Rajender: కాసేపట్లో ఢిల్లీకి బండిసంజయ్, కిషన్‌రెడ్డి * బీజేపీలో చేరిక పార్టీ పెద్దలతో చర్చ

Sandeep Eggoju
Published on: 31 May 2021 12:29 PM IST
Etela Rajender Meets BJP National President JP Nadda Today
X

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: ఢిల్లీకి వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బండిసంజయ్‌, కిషన్‌ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ నడ్డా వద్దకు వెళ్లనున్నారు. అయితే ఈ భేటీలో పలు రాజకీయ చర్చించనున్నారు. ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్య, బీజేపీలో తన రాజకీయ భవిష్యత్‌కు హామీపై తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం ఈటల బీజేపీలో ఎప్పుడు చేరాలనే దానిపై ఓ క్లారిటీకి రానున్నారు. తన నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వెళ్లి కార్యకర్తలు, ప్రజలను కలిసిన తర్వాతే ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించగానే.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story