నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం...పేషెంట్ కడుపులో కత్తెర

నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం...పేషెంట్ కడుపులో కత్తెర
x
Highlights

వైద్యో నారాయణో హరి అంటారు అంటే వైద్యుడు నారాయణుడితో సమానమని అర్థం. ధన్వంతరి వారసులుగా ధరణిలోన దేవతలుగా ఆరాధించబడుతున్న వైద్యులే నిర్లక్ష్యంగా...

వైద్యో నారాయణో హరి అంటారు అంటే వైద్యుడు నారాయణుడితో సమానమని అర్థం. ధన్వంతరి వారసులుగా ధరణిలోన దేవతలుగా ఆరాధించబడుతున్న వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోగుల పరిస్థితి ఏంటి.? దేవుడిని నమ్మని వాళ్లు కూడా డాక్టర్లను నమ్ముతారు. రోగాలను బాగు చేస్తారని విశ్వసిస్తారు. కానీ ఆ వైద్యులే యమకింకరులుగా మారితే ప్రాణాలతో చెలగాటమాడితే అలాంటి పరిస్థితే రాజధాని హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రి. బాధ్యతగా ఉంటారని, బాధలు తీరుస్తారని నమ్మి వచ్చే రోగులకు నిమ్స్‌ హాస్పిటల్‌ ఒక దేవాలయంతో సమానం. ఆ దేవాలయంలోని వైద్యులంతా దేవతలనే నమ్ముతారు ఇక్కడి వచ్చే వారు. కానీ ఆ వైద్యులు చేస్తున్నదేమిటి? రోగాలను తగ్గించడం మాట పక్కన పెడితే లేని రోగాలను తెప్పిచ్చే చర్యలు తీసుకోవడమే దారుణం.

డిసెంబర్ 2న హెర్నియా సమస్యతో బాధపడుతూ నిమ్స్‌లో చేరింది మహేశ్వరి. ఆమెకు వైద్యులు గ్యాస్టో ఎంట్రాలజీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన డాక్టర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మహేశ్వరి కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసేశారు. సర్జరీ డాక్టర్ల చేశాక వచ్చిన మరో డాక్టర్ల బృందం కత్తెర మరిచిపోయి ఉంటారని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారిప్పుడు.

చికిత్స పొందిన అనంతరం మహేశ్వరి ఇంటికి వెళ్లిపోయింది. మూడు నెలలుగా ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుంది. తనకు చికిత్స చేసిన నిమ్స్‌కే మళ్లీ వచ్చి పరీక్షించుకుంది. ఆమెకు తీసిన ఎక్స్ రేలో కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. కడుపులో కత్తెర మరిచిపోవడంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో ఉన్న కత్తెరను తీసివేసేందుకు మహేశ్వరికి వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories