Top
logo

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు.. కాంగ్రెస్ వాకౌట్‌

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు.. కాంగ్రెస్ వాకౌట్‌
Highlights

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌వేశ‌పెట్టారు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లును లోక్‌స‌భ‌లో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన మైనార్టీలు ఇక్కడ ఆరేళ్ళ పాటు నివసిస్తే వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా బిల్లు ప్రవేశ పెట్టారు. అయితే పౌరసత్వం కల్పించే జాబితాలో హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లను చేర్చి ముస్లింలను వదిలి వేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపాల‌ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. విపక్షాల తీరుపై రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పౌర‌స‌త్వ బిల్లుపై త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల వ‌ల్ల అస్సోం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు త‌మ‌కు తెలుసన్న రాజ్‌నాథ్ పౌర‌స‌త్వ బిల్లుతో ఎవ‌రూ వివ‌క్ష‌కు గురికారని వ్యాఖ్యానించారు.

Next Story