Top
logo

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్‌

cmkcrcmkcr
Highlights

తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం 11.30గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం 11.30గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. గజ్వేల్‌ శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story