Top
logo

తెలంగాణలో కలకలం రేపుతున్న చెడ్డీ గ్యాంగ్

తెలంగాణలో కలకలం రేపుతున్న చెడ్డీ గ్యాంగ్
X
Highlights

తెలంగాణలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రెచ్చిపోతోంది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో వేరు వేరు ఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

తెలంగాణలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ మళ్లీ రెచ్చిపోతోంది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో వేరు వేరు ఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా చడ్డీ గ్యాంగ్. గతంలో రాజధాని సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో హల్‌చల్ చేసింది. పలు చోట్ల దొపిడీలు చేసింది. మరికొన్ని చోట్ల దొంగతనాలకు విఫలయత్నం చేసింది. అయితే కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ దోపిడీ ముఠా మరోసారి భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి ముంగిట హైదరాబాద్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోట్ల దోపిడీకీ ప్లాన్ చేసి విఫలయత్నం అయ్యింది. చెడ్డీ గ్యాంకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమారాల్లో రికార్డ్ అవడంతో పోలీసులు వాళ్లకోసం గాలిస్తున్నారు. అయితే తాజాగా గద్వాలలోనూ చెడ్డీ గ్యాంగ్ హల్‌ చల్ చేసింది. పట్టణంలోని వేణు అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనానికి యత్నించింది.

తెల్లవారుజుమున రెండు గంటల సమయంలో సీసీ కెమెరాలు తొలగించి ఐదుగురు దొంగలు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. తాళం వేసిన ఇళ్లు లేకపోవడం, డొర్‌ కొట్టినా చాలా మంది తీయక పోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా చెడ్డీ గ్యాంగ్‌ పనిగా పోలీసులు గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు ఏకంగా పట్టణంలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.మొత్తానికి వరుసగా రాష్ట్రంలో చడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టిస్తుండటంతో సంక్రాంతికి ఊరెళ్లేవారు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story