మరోసారి చెడ్డీ బనియన్ గ్యాంగ్ హల్ చల్

మరోసారి చెడ్డీ బనియన్ గ్యాంగ్ హల్ చల్
x
Highlights

చెడ్డీ గ్యాంగ్ మళ్లీ చెలరేగిపోయింది. దోపిడీలు లూటీలకు పక్కా ప్లాన్ వేసుకున్న ముఠా సంచారంతో జనం మరోసారి ఉలిక్కిపడ్డారు.

చెడ్డీ గ్యాంగ్ మళ్లీ చెలరేగిపోయింది. దోపిడీలు లూటీలకు పక్కా ప్లాన్ వేసుకున్న ముఠా సంచారంతో జనం మరోసారి ఉలిక్కిపడ్డారు. గత ఏడాది ఇదే సమయానికి హైదరాబాద్ సిటీలో 28 దోపీడీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ తాజా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోట్ల దోపిడీకీ ప్లాన్ చేసి విఫలయత్నం అయ్యారు. సీసీ టీవీ కెమారాల్లో రికార్డ అయిన ఫుటేజీ దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోసారి ట్విన్ సిటీస్ లో చెడ్డీ బనియన్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. సంక్రాంతి పండగ టార్గెట్‌గా చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్‌ సిటీలో చొరబడిందని అనుమానిస్తున్నారు పోలీసులు. చేతిలో చెప్పులు ఒంటిపై ఆయిల్.. చెట్ల పొదలే షెల్టర్ చేసుకుని దోపిడీ దొంగతనాలకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. ఎవరైనా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై దాడులు చేసి ఎస్కేప్ అవుతుంటారు.

పగలంతా రెక్కీ నిర్వహించడం రాత్రంతా దోపిడీలు చేయడమే పనిగా పెట్టుకుంది చెడ్డీ గ్యాంగ్. ఇండిపెండెంట్ హౌస్ లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్ లే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతుంది ఈ ముఠా. గత ఏడాది ఇసే సమయానికి కూకట్ పల్లిలో మూడు చోట్ల చోరీలకు పాల్పడిన గ్యాంగ్ తాజాగా మరోసారి చెడ్డీ, బనియన్, లుంగీలు ధరించి దోపీడీకి యత్నించారు.

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫమయ్యాయి. సినీ ఫక్కీలో దోపీడీకి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతుంది ఈ గ్యాంగ్. దోపిడీకి పాల్పడే ముందు టార్గెట్ చేసుకున్నఇళ్లలోకి చొరబడి లోపల ఉన్న వారిని మారణాయుధాలతో బెదిరించి బంగారు, వెండి నగలతో పాటు నగదు దోచుకెళ్తారు. తమ పని పూర్తికాగానా కాళ్లకు చెప్పులు వేసుకుని కొంత దూరంలో పార్కింగ్ చేసిన వాహనం వద్దకు నడుచుకుంటూ వెళ్తారు. చూసేవాళ్లకు ఏమాత్రం అనుమానం కలగకుండా పరారీ అవుతుంటారు.చెడ్డీబనియన్ గ్యాంగ్ ఎక్కడ తారసపడినా కనిపించినా అనుమానం వచ్చిన వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తన్నారు. రాత్రి పూట మాత్రమే దోపిడీలకు పాల్పడుతన్న గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. తప్పించుకు తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు టీంలు గాలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories