ఈరోజు (మే-16-శనివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.






Show Full Article

Live Updates

  • విశాఖ జిల్లా కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు.
    16 May 2020 6:02 AM GMT

    విశాఖ జిల్లా కలెక్టర్ కు రూ.50 కోట్ల చెక్ అందించిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు.

    ★ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీక్ కావడంతో 12 మంది మృతి చెందగా, వందల మంది ఆసుపత్రుల పాలవడం తెలిసిందే.

    ★ ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) కూడా స్పందించింది.

    ★ ముందుగా, రూ.50 కోట్లు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలంటూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించింది.

    ★ ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు రూ.50 కోట్ల చెక్ అందించారు.

    ★ దీనిపై కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, ఎన్ జీటీ ఆదేశాల మేరకు ఆ నిధిని వినియోగిస్తామని చెప్పారు.


  • 16 May 2020 5:55 AM GMT

    తెలంగాణలో కొత్త మినహాయింపులు... నేటి నుంచి తెరచుకునేవి ఇవే...

    తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు కరోనా ఫ్రీ కావడంతో ప్రభుత్వం మెల్లమెల్లగా నిబంధనలను సడలిస్తోంది.ఇందులో భాగంగానే గత వారం నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు, రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు, ఆర్టీఏ ఆఫీసులు నడుస్తున్నాయి.     -మరిన్ని వివరాలు 






  • 16 May 2020 4:31 AM GMT

    దొరకని చిరుత జాడ

    జాతీయరహదారిపై ప్రత్యక్షం అయిన చిరుత అక్కడి నుంచి మాయం అయిపొయింది. ఈ సంఘటన గురువారం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరుత జాడను గుర్తించడానికి, పట్టుకోవదానికీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకూ ఫలించలేదు.

    - మరిన్ని వివరాలు 

  • 16 May 2020 3:57 AM GMT

    ట్రాక్టర్ బోల్తాపడి..డ్రైవర్ మృతి

    ఎపీలోని తూర్పుగోదావరి జిల్లా...జగ్గంపేట నియోజక వర్గం లో ఈ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.

    గోకవరం పట్టణ శివారు గంగాలమ్మ గుడి వద్ద తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తా పదిండి. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

  • 16 May 2020 3:30 AM GMT

    ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

     దేవాలయాలు తెరచిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసిన దేవాదాయశాఖ

    - కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని

    ఈవోలకి ఆదేశాలు

    - ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకునేలా చూడాలి

    - భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా చూడాలి

    - ఆన్లైన్ లోనే దర్శనానికి సంబందించిన టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ

    - డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ తో పాటు శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి

    - ఎప్పటికప్పుడు గుడి పరిసరాలు, క్యూ లైన్ లు సోడియం హైపో క్లోరైడ్ తో స్ప్రే చేయాలి

    - ప్రతి దేవాలయంలోని ఇవన్నీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.



     


  • 16 May 2020 2:47 AM GMT

    తెలంగాణాలో ఆ నాలుగుజోన్లలోనే కరోనా కేసులు : సీఎం కేసీఆర్

    తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ లోని lb నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసులున్నాయని అన్నారు.

    - మరిన్ని వివరాలు 

  • 16 May 2020 2:42 AM GMT

    కోవిడ్ సహా పలు సమీక్షా సమావేశాలు నిర్వహించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

    - ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు పలు సమీక్షా సమావేశాల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ విషయంలో కీలక సమీక్ష చేయనున్నారు.

    - రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష

    - మధ్యాహ్నం 12.30కి కోవిడ్ వ్యాప్తి నివారణపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

    - లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

    - మధ్యాహ్నం 3.30కు వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పై సీఎం సమీక్ష

    - ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు ద్వారా పూర్తి మౌలిక వసతులు కల్పనపై చర్చ.



     


  • 16 May 2020 1:25 AM GMT

    కొండెక్కిన వెండి!

    వెండి ధరలు ఒక్కసారిగా భారీగా ఎగశాయి. కేజీకి ఏకంగా రెండువేలకు పైగా పెరుగుదల నమోదు చేశాయి. ఇక బంగారం ధరలు కూడా హైదరాబాద్ లో స్వల్పంగా పది గ్రాములకు వంద రూపాయల పైన పెరుగుదల నమోదు చేస్తే..దేశ రాజధానిలో మాత్రం 600 రూపాయల వరకూ పైకెగాశాయి.

    బంగారం, వెండి ఈరోజు (మే 16) ప్రారంభధరలు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! 

    -పూర్తి వివరాలు 

  • 16 May 2020 1:06 AM GMT

    పుచ్చకాయల మధ్యలో మద్యం అక్రమ రవాణా

    - తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమ మద్యం తరలింపు

    - తెలంగాణ నుండి ఆంధ్రాకు వస్తున్న పుచ్చకాయలు వ్యాను లో అక్రమ దందా!

    - పైన పుచ్చకాయలు కింద ఐదు లక్షలు విలువగల మద్యం పెట్టి పొందుగల బోర్డర్ దాటే ప్రయత్నంలో పట్టుబడిన మద్యం 

    - అక్రమ రవాణా ఆటకట్టించిన దాచేపల్లి ఎస్ఐ బాల నాగిరెడ్డి, సిబ్బంది



     

     

  • 16 May 2020 12:49 AM GMT

    హైదరాబాద్ : ఇక్కడి నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు కాలిబాటన పయనమయ్యారు.  వీరంతా తాండూరు ప్రాంతం నుంచి తమ స్వరాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్ లకు వేల్లిపోతున్నట్టు చెప్పారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా తమకు ఏపనీ లేదనీ, ఇక చేసేదేం లేక తమ ప్రాంతాలకు వేల్లిపోతున్నామనీ వారు చెబుతున్నారు.



Print Article
More On
Next Story
More Stories