మాస్‌ రాజా నుంచి మాస్‌ సాంగ్ వచ్చేసింది!

మాస్‌ రాజా నుంచి మాస్‌ సాంగ్ వచ్చేసింది!
x
Highlights

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే తాజాగా దీపావళి సందర్బంగా మూవీ నుంచి ఊర‌మాస్ లాగా సాగిపోయే ఐటెంసాంగ్ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. "భూమ్ బ‌ద్ద‌లు నా ముద్దుల సౌండ్..నీక్కూడా ఇస్తాన‌బ్బాయి" అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో నటి అప్సర రాణి రవితేజతో కలిసి స్టెప్పులేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా సింగర్ మంగ్లి ఆలపించారు. జానీ మాస్టర్‌ కోరియోగ్రఫీ చేశారు.

ఇప్పటికే పోస్టర్లతో సినిమా పైన అంచనాలను పెంచిన చిత్ర యూనిట్ తాజాగా ఊర‌మాస్ సాంగ్ తో ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. అటు విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ మళ్ళీ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా అనంతరం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమాని చేస్తున్నాడు రవితేజ... గతంలో వీరి కాంబినేషన్ లో వీర అనే సినిమా వచ్చింది. తాజాగా రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు అనే సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories