సర్వలో ఇరుకున్న నాలుగేళ్ల చిన్నారి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టాలో 4 ఏళ్ల బాలిక సర్వలో ఇరుక్కుంది. గ్రామానికి చెందిన ఎచ్చెర్ల త్రినాధ కుమార్తె రేవతి ఇంటి పరిసరాల్లో అదుకుంటూ సర్వలో కూర్చుంది. అయితే పైకి లేచి వచ్చేందుకు వీలు కాకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యి ఏడుపు మొదలు పెట్టింది.

Arun Chilukuri
Updated on: 28 Dec 2018 6:29 PM IST
baby
X
baby

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టాలో 4 ఏళ్ల బాలిక సర్వలో ఇరుక్కుంది. గ్రామానికి చెందిన ఎచ్చెర్ల త్రినాధ కుమార్తె రేవతి ఇంటి పరిసరాల్లో అదుకుంటూ సర్వలో కూర్చుంది. అయితే పైకి లేచి వచ్చేందుకు వీలు కాకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యి ఏడుపు మొదలు పెట్టింది. చిన్నారి ఏడుపు విని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే లోపల కూర్చుండి పోవడంతో పట్టు దొరక్క బయటకు తీయడం సాధ్యం కాలేదు. దీంతో సమీపంలోని టింకరింగ్ షాపు దగ్గరకు తీసుకెళ్లి సర్వను కత్తరించి బాలికను బయటకు తీశారు. చిన్నారి క్షేమంగా రావడంతో తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story