ఆయేషా మీరా కేసులో సీబీఐ దూకుడు

Ayesha Meera
x
Ayesha Meera
Highlights

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిన్న ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ కేసు వివరాలు సేకరిస్తోంది.

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిన్న ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసి మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన సీబీఐ కేసు వివరాలు సేకరిస్తోంది. డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన కోర్టు సిబ్బందిపైనా కేసు నమోదు చేశారు. ముగ్గురు కోర్టు సిబ్బందిపై ఐపీసీ 120b, 201, 409, 13(2), రెడ్ విత్ 13 (1)(D) కింద ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేశారు. 2014 అక్టోబర్‌లో సాక్ష్యాలు తారుమారు చేసినట్లు FIRలో సీబీఐ పేర్కొంది.

పదకొండేళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా రేప్‌ అండ్ మర్డర్ కేసు సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌ను తలపిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేసిన సీబీఐ మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది. విజయవాడలో మకాం వేసిన నాలుగు సీబీఐ బృందాలు కేసు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఆయేషా మీరా తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అలాగే ఆయేషా బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించనున్నారు. అదేవిధంగా ఆయేషా కేసులో అరెస్టై జైలుశిక్ష అనుభవించిన సత్యంబాబు, అతని తల్లి, బంధువులను కూడా విచారించనున్నారు. ఈ కేసులో మొదట్నుంచీ పోలీసులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్‌ అధికారులను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.

ఆయేషా మీరా దారుణ హత్యకు గురై పదకొండేళ్లవుతున్నా అసలు నిందితులు ఎవరనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల మిస్టరీగా మిగిలిపోయింది. బీ ఫార్మసీ చదువుతోన్న ఆయేషా మీరా 2007 డిసెంబర్ 28న విజయవాడ ఇబ్రహీంపట్నంలో తానుంటున్న హాస్టల్‌లో అత్యంగా దారుణంగా రేప్ అండ్ మర్డర్‌కి గురైంది. అయితే ఈ కేసులో అరెస్టై జీవితఖైదు పడ్డ సత్యంబాబు 8ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా విడుదల కావడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. సత్యంబాబు నిర్దోషి అయితే అసలు నిందితులెవరో తేల్చాలంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అయితే కీలక సాక్ష్యాధారాలు, రికార్డులు లేవంటూ సిట్‌ నివేదించడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఆయేషా కేసులో అసలు నిందితులెవరో తేల్చాలంటూ సీబీఐని ఆదేశించింది. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories