ఏడాదికి పైగా నీళ్లలో ఉన్నా ఈ ఫోన్‌ పనిచేస్తోంది..ఇదిగో వీడియో!

ఏడాదికి పైగా నీళ్లలో ఉన్నా ఈ ఫోన్‌ పనిచేస్తోంది..ఇదిగో వీడియో!
x
Highlights

నీళ్లలో పడి 15 నెలల తర్వాత దొరికిన ఫోన్‌ పనిచేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇది నిజం. అమెరికా యూట్యూబర్‌ మైఖేల్‌ బెన్నెట్‌ ఈ...

నీళ్లలో పడి 15 నెలల తర్వాత దొరికిన ఫోన్‌ పనిచేస్తుందంటే మీరు నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ ఇది నిజం. అమెరికా యూట్యూబర్‌ మైఖేల్‌ బెన్నెట్‌ ఈ విషయాన్ని బయపెట్టారు. 'నుజెట్‌నొగిట్‌' యూట్యూబ్‌ చానల్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. వాషింగ్టన్ లో మైఖేల్ బెన్నెట్ అనే యూట్యూబర్ నీళ్లలో మునిగిపోయిన విలువైన వస్తువుల కోసం గాలిస్తంటాడు. దానికి సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో పెడుతుంటాడు. తన పనిలో భాగంగా ఇటీవలే సౌత్ ‌కరోలినాలోని ఎడిస్టో నదిలో దిగాడు. ఆ నది అడుగున అతనికో వస్తువు కనిపించింది. ఏంటా అని చూస్తే అదో ఐఫోన్. దాన్ని చూడగానే అది నదిలో పడిపోయి చాలారోజులైందని మైఖేల్‌కు అర్థమైంది. పని చేస్తుందో లేదో అనే అనుమానంతోనే దాన్ని బయటకు తీసుకొచ్చి చార్జింగ్ పెట్టాడు. అయితే ఆ ఫోన్ అతని అంచనాలను తారుమారు చేస్తూ ఆనయింది. ఇంతకాలం నీటిలో ఉన్నా అది చెక్కుచెదరకపోవడంతో అవాక్కయ్యాడు. ఆ తరువాత ఫోన్‌లోని సిమ్ కార్డు సాయంతో అది ఎవరిదో కనిపెట్టాడు. దాన్ని సొంతదారుకు అందించాడు. 2018 జూన్‌లో ఫోన్ పోయిందని ఈ సందర్భంగా మైఖేల్‌ తెలుసుకున్నాడు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం దీనికి వీక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. 'నేను ఆ ఫోన్ పనిచేస్తుందని అస్సలు అనుకోలేదు' అని స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైఖేల్ వ్యాఖ్యానించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories