భారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రపంచ దేశాలు

భారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రపంచ దేశాలు
x
Highlights

ప్రపంచ దేశాలన్నీ కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. కరోనా బీభత్సంతో ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ కరోనా...

ప్రపంచ దేశాలన్నీ కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నాయి. కరోనా బీభత్సంతో ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ కరోనా కట్టడికి ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలపై దృష్టి పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అన్ని దేశాలు రిలీఫ్‌ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.

కోవిడ్‌–19తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోదీ సర్కార్‌ 20 లక్షల కోట్ల రూపాయలతో రిలీఫ్ ప్యాకేజ్‌ ప్రకటించింది. ఇది దేశ జీడీపీలో పది శాతం. ఇలా జీడీపీలో రిలీఫ్ ప్యాకేజ్‌లకు అత్యధికంగా ఖర్చు పెట్టిన జీ–20 దేశాల్లో అయిదో స్థానంలో నిలిచింది ఇండియా. ఇక ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్‌తో కలిసి 19వ స్థానంలో నిలిచింది భారత్‌. జపాన్‌ అత్యధికంగా జీడీపీలో 21.1 శాతం నిధులను ఖర్చు చేయగా అమెరికా 13.3, ఆస్ట్రేలియా 10.8, జర్మనీ 10.7 శాతం నిధులను ఖర్చు చేస్తున్నాయి.

2008 ఆర్థిక మాంద్యం కంటే అధికంగా ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమైపోవడంతో సహాయ ప్యాకేజీలతో భవిష్యత్‌కి బాటలు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. హాంకాంగ్, కోస్టారికా, కెనడా లాంటి దేశాలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు సాయం చేయగా ఉద్యోగులకు 90 శాతం వరకు వేతనాలను ప్రభుత్వమే చెల్లించేలా ప్యాకేజీ రూపొందించింది నెదర్లాండ్స్‌. అటు ఫ్రాన్స్ కూడా ఉద్యోగుల గ్రాస్‌ వేతనంలో 84% చెల్లిస్తోంది.

కరోనాతో దెబ్బతిన్న అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఉన్నత విద్యా రుణాల మాఫీ, ఫుడ్‌ బ్యాంకులు, కోవిడ్‌పై పరిశోధనలు, వ్యాక్సిన్‌ అభివృద్ధి వంటి వాటిపై భారీగా నిధుల్ని వెచ్చించింది అమెరికా. ఇప్పటివరకు రెండున్నర లక్షల కోట్ల డాలర్లకు పైగా ప్యాకేజ్‌ ప్రకటించిన అమెరికా నాలుగో దశ విడుదలపై కసరత్తు చేస్తోంది. కరోనా ఎయిర్‌ రిలీఫ్‌ అండ్‌ ఎకనామిక్‌ స్టిమ్యులస్‌ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీని అమెరికా సెనేట్‌ అంగీకరించింది.

రిలీఫ్‌ ప్యాకేజీతో స్వయం ఉపాధికే పెద్ద పీట వేసిన బ్రిటన్‌. సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకుంది. కోవిడ్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పించే పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు చేసే వారికి రుణాలు మంజూరు చేసింది. కోవిడ్‌ మళ్లీ విజృంభించే సంకేతాలు ఉండడంతో భవిష్య నిధికి కొంత కేటాయింపులు జరిపింది. ఇటలీ తన ప్యాకేజీలో ఆరోగ్య రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. కంపెనీల్లో శానిటైజేషన్, ఉద్యోగుల భద్రత కోసం పన్నుల్లో 50శాతం మినహాయింపునిచ్చింది.

ఇక కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెనడా సహాయ ప్యాకేజీ కేటాయింపుల్లోనూ ప్రశంసలందుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి 75% అద్దె తగ్గించేలా చర్యలు తీసుకున్న కెనడా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులు, సేవా రంగంలో ఉండేవారిని ఎక్కువగా ఆదుకుంది. అంతే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ దేశం నెలకి 2 వేల కెనడా డాలర్ల చొప్పున నాలుగు నెలలు నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories