logo
ప్రపంచం

వైట్ హౌస్‌ను ట్రంప్ అంత ఈజీగా విడిచిపెట్టి వెళ్లరా ?

వైట్ హౌస్‌ను ట్రంప్ అంత ఈజీగా విడిచిపెట్టి వెళ్లరా ?
X
Highlights

వైట్ హౌస్‌ను ట్రంప్ అంత ఈజీగా విడిచిపెట్టి వెళ్లరా ? బైడెన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ...

వైట్ హౌస్‌ను ట్రంప్ అంత ఈజీగా విడిచిపెట్టి వెళ్లరా ? బైడెన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ మనమే గెలుస్తామంటూ ట్రంప్ మళ్లీ ప్రకటన చేయడం వెనక అర్థం ఏంటి ? ఫైజర్ టీకా విషయాలను కూడా కావాలని దాచిపెట్టారా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగాయ్. ముందుగా బైడెన్, ట్రంప్ మధ్య టఫ్ ఫైట్ కనిపించినా ఆ తర్వాత వార్ వన్ సైడ్ అయింది. కీలకమైన ఐదు రాష్ట్రాల దగ్గర చివరి రెండురోజులు సందిగ్ధత కొనసాగగా బలం లేని ప్రాంతంలోనూ బైడెన్ సత్తాచాటారు. దీంతో 290 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ అందనంత ఆధిక్యంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. త్వరలో వైట్ హౌస్‌లోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఐతే అటు తనతో అంత వీజీ కాదు అన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని బదిలీ చేసేందుకు ససేమిరా అంటున్నట్లుగా కనిపిస్తోంది.

ఓటమి కంటే గెలుపే సులభమని జో బైడెన్‌ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు కష్టసాధ్యమని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఎలక్షన్ రిజల్ట్స్ వెల్లడి కాకుండానే గెలిచానంటూ ప్రకటించిన ఆయన ఆ తర్వాత కూడా అపజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఇచ్చే స్పీచ్ ఊసే ఎత్తడం లేదు. పైగా తానే ఎన్నికల్లో గెలిచానని ప్రకటించిన ట్రంప్‌ అదే వైఖరి కొనసాగించి మళ్లీ మంగళవారం కూడా మనం గెలుస్తాం అంటూ ట్వీట్ చేశారు.

సాధారణ ప్రజలు ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేస్తే ట్విటర్‌ దాన్ని తొలగిస్తుంది. ఐతే దేశాధ్యక్షుడి స్థాయి వార్తలకు ఈ నిబంధన వర్తించకపోవటాన్ని ట్రంప్‌ వినియోగించుకుంటున్నారు. తానే గెలిచానని, ఎన్నికల విజయాలను డెమొక్రాటిక్‌ పార్టీ దొంగిలించేందుకు ప్రయత్నిస్తోందంటూ నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్విటర్‌ చేసేదేంలేక ఆయన సందేశాల్లో కొన్నిటిపై అవాస్తవ సమాచారం అని తెలిపే విధంగా ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక ఉంచుతోంది. ఐతే ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఈ సౌలభ్యాన్ని తొలగిస్తామని ట్విటర్‌ ప్రకటించింది.

వైట్ హౌస్ వీడి వెళ్లేముందు బైడెన్‌ను ఇరుకునపెట్టాలన్నది ట్రంప్ ప్లాన్‌లా కనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. అందుకే చైనా విషయంలో గట్టి కామెంట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక అటు ఎన్నికలకు ముందు వ్యాక్సిన్ తీసుకొస్తామని ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఐతే టీకా అందుబాటులోకి రాకపోవడంతో అంచనాలు రివర్స్ అయ్యాయ్. ఐతే ఫైజర్ టీకాకు సంబంధించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తనకు కరోనా వ్యాక్సిన్ విజయం దక్కకూడదని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా శ్వేత సౌదం నుంచి వెళ్లే లోపు ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Web TitleWill Donald Trump leave his house?
Next Story