అగ్రరాజ్యంలో కరోనా విలయతాండవం.. లక్ష నుంచి 2.40 లక్షల మంది చనిపోతారని వైట్ హౌస్ అంచనా

అగ్రరాజ్యంలో కరోనా విలయతాండవం.. లక్ష నుంచి 2.40 లక్షల మంది చనిపోతారని వైట్ హౌస్ అంచనా
x
Highlights

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. వేలాది మంది రోజుకు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే డెత్ టోల్ చైనాను క్రాస్ చేయగా మరింత పెరిగే అవకాశాలు...

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. వేలాది మంది రోజుకు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే డెత్ టోల్ చైనాను క్రాస్ చేయగా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న వెయ్యికి పైగా కేసులు నమోదు కావటంతో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువైంది.

అమెరికాలో కరోనా కేసులు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. రోజూ వేలాది మంది కొవిడ్ వైరస్ బారిన పడుతుండటంతో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటితో కరోనా మరణాల్లో చైనాను దాటింది అమెరికా. చైనాలో 3వేల 3వందల మంది చనిపోగా అమెరికాలో 3వేల 4వందలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల్లో ఇటలీ, స్పెయిన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

న్యూయార్క్ లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవగా మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంది. దాదాపు యూఎస్ లోని అన్ని రాష్ట్రాల్లో కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బాధితుల్లో దాదాపు 80 శాతం మందికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది అక్కడి ప్రభుత్వం.

పరిస్థితి రోజురోజుకు విషమిస్తుండటంతో రాబోయే రెండు వారాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే దేశం మరింత గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికాలో 2 లక్షల 40 వేల మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోతారని వైట్ హౌస్ అంచనా వేసింది. దేశ ప్రజలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ట్రంప్ తెలిపారు.

సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చని వైట్ హౌస్ కరోనా రెస్పాన్సివ్ టీమ్ కో ఆర్డినేటర్ డెబోరా బిర్క్స్ తెలిపారు. ప్రజలు అలవాట్లను మార్చుకుని సామాజిక దూరం పాటించాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తే కరోనాని నివారించవచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories