ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు వైట్‌హౌస్ ఆమోదం

ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2025 4:30 PM IST
ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు వైట్‌హౌస్ ఆమోదం
X

ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు వైట్‌హౌస్ ఆమోదం

ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపునకు సానుకూలంగా ఓట్లు వేశారు.

మరో 209 మంది సభ్యులు షట్‌డౌన్ ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222 - 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు.

ప్రస్తుతం ఆ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్లింది. ఈ రోజు రాత్రి 9.45 గంటలకు ఆయన ఆ బిల్లుపై సంతకం చేయనున్నారు. అధ్యక్షుడి సంతకంతో బిల్లు అమల్లోకి రానుంది. 43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. ఇక, ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story