నా జీవితంలో తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయమది

నా జీవితంలో తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయమది
x
Highlights

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో తన ప్రభావం చూపుతోన్న కరోనా.. వేల ప్రాణాలు బలితీసుకుంటోంది. కరోనా...

అగ్రరాజ్యంలో కరోనా మారణహోమం కొనసాగుతోంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలో తన ప్రభావం చూపుతోన్న కరోనా.. వేల ప్రాణాలు బలితీసుకుంటోంది. కరోనా మహమ్మారితో ఆ దేశం ఎన్నడూ లేనంత సంక్షోభంలో చిక్కుకుంది. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు వేల కొద్దీ కేసులు వస్తుండటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. అభివృద్ధి చెందిన దేశమైనా.. అత్యవసర స్థితిలో వైద్య సదుపాయాన్ని అందించలేకపోగా.. అటు ప్రభుత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటంతో కరోనా విలయంలో చిక్కుకుంది అమెరికా.

కరోనా కారణంగా యూఎస్ లో ఉపాధి కరువైంది. దీంతో చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే అనేక మంది ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్నది సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటి వరకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద నిర్ణయం కాబోతోందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు దేశాన్ని ఎప్పుడు తెరవాలన్న దానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories