ప్రపంచవ్యాప్తంగా 1400మంది వాట్సప్ ఖాతాల హ్యాకింగ్

ప్రపంచవ్యాప్తంగా 1400మంది వాట్సప్ ఖాతాల హ్యాకింగ్
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న వార్త కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ ఎన్ ఎస్ వో గ్రూప్ కు చెందిన పెగాసస్...

ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 1400 మంది వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న వార్త కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ ఎన్ ఎస్ వో గ్రూప్ కు చెందిన పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ స్పై వేర్ ను ఉపయోగించి హ్యాకర్లు వాట్సాప్ లలోకి చొరబడినట్లు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొందరి వాట్సప్ ఖాతాలను హ్యాకర్లు టార్గెట్ చేశారని ఇందులో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల ఫోన్లు ఉన్నాయని వాట్సాప్ కంపెనీ తెలిపింది. 24 మందికి పైగా భారతీయ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయని తెలుస్తోంది.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా వాట్సప్ ఆపరేటర్ల పాస్ వార్డ్స్, టెక్స్ట్ మెసేజ్ లనుకూడా హ్యాకర్లు తెలుసుకున్నట్లు వాట్సాప్ సందేశాల సమాచారం అంతా వారి దగ్గరుందని తెలుస్తోంది. వాట్సాప్ హ్యాకింగ్ వ్యవహారంపై భారత్ ఐటీ శాఖ వివరణ కోరిందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. దేశంలోని పలువురు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తల వాట్సాప్‌ ఖాతాలపై గూఢచర్యం నెరిపినట్టు వస్తున్న కథనాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రైవసీ హక్కుల పట్ల బీజేపీ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ గూఢచర్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories