డ్రాగన్ కంట్రీ బీఆర్ఐ ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతోందా.. బీఆర్ఐ విషయంలో జిన్‌పింగ్ లెక్క ఎక్కడ తప్పింది?

What Gwadar Port Failure Says About China
x

డ్రాగన్ కంట్రీ బీఆర్ఐ ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతోందా.. బీఆర్ఐ విషయంలో జిన్‌పింగ్ లెక్క ఎక్కడ తప్పింది?

Highlights

Gwadar Port: బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్.. డ్రాగన్ కంట్రీ చైనా అగ్రరాజ్యంగా అవతరించడమే లక్ష్యంగా ప్లాన్ చేసిన మెగా ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి దశాబ్దం దాటిపోయింది.

Gwadar Port: బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్.. డ్రాగన్ కంట్రీ చైనా అగ్రరాజ్యంగా అవతరించడమే లక్ష్యంగా ప్లాన్ చేసిన మెగా ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయి దశాబ్దం దాటిపోయింది. మరి బీఆర్ఐ లక్ష్యం నెరవేరిందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ కాదనే వినిపిస్తోంది. అందుకు పాకిస్తాన్ గ్వాదర్ పోర్టే ఉదాహరణ. ఎన్నో అంచనాలతో గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసింది బీజింగ్. కానీ, 2023 మొత్తంలో ఆ పోర్టుకు వెళ్లిన వాణిజ్య నౌకలెన్నో తెలుసా? కేవలం 17 మాత్రమే. గ్వాదర్ ఒక్కటే కాదు.. చైనా బంగారు బాతుగా భావించిన చాలా పోర్టులు బీజింగ్‌కు భారీ షాకులే ఇస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అసలు డ్రాగన్ కంట్రీ చైనా బీఆర్ఐ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? గ్వాదర్ విషయంలో జిన్‌పింగ్ లెక్క ఎక్కడ తప్పింది?

ప్రపంచంపై ఆధిపత్యం కోసం చైనా పదేళ్ల కిందట మొదలుపెట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో రహదారులు, హైవేలు, పైప్‌లైన్లు నిర్మించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులో దాదాపు 150 దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు భాగమయ్యాయి. సామ్రాజ్యవాద కాంక్షతోనే డ్రాగన్‌ బీఆర్‌ఐ తీసుకొచ్చిందని చాలా దేశాలు గ్రహించాయి. ఈ ప్రాజెక్టు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి.. గ్రరాజ్యంగా అవతరించడమే లక్ష్యంగా తరమీదకు తెచ్చిన బీఆర్ఐ చైనాకు కూడా కలిసిరావడం లేదు. పాకిస్తాన్ గ్వాదర్ పోర్టే అందుకు ఉదాహరణ.

2016లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటన ఇది. ఆ రోజును ఒకకొత్త ఆవిర్భావంగా అభివర్ణించారు. ఆయన ఉద్దేశంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్‌తో పాకిస్తాన్ ప్రగతి పథంలో దూసుకుపోతుందని. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో చైనా ఏకంగా 62 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో దీన్ని అత్యంత కీలకమైనదిగా భావించింది కూడా. బీఆర్ఐ విజయవంతం కావడం పాకిస్తాన్ కంటే చైనాకే కీలకం. అలాంటి ప్రాజెక్టుకు గుండె వంటిది గ్వాదర్‌ పోర్టు. సీపెక్ వెనుక ఉన్న ఆలోచన చైనాలోని పశ్చిమ జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ను పాకిస్తాన్ ద్వారా సముద్రంతో అనుసంధానిం చడమే. ఇది చైనాకు వాణిజ్య మార్గాలను తగ్గిస్తుంది, అలాగే మలేషియా, సుమత్రా మధ్య హిందూ, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఇరుకైన జలమార్గమైన మలక్కా స్ట్రెయిట్ చోక్ పాయింట్‌ను నివారించ డంలో సహాయపడుతుంది.

అదే సమయంలో, 2వేల కిలోమీటర్ల కారిడార్ వెంబడి వాణిజ్యం, పరిశ్రమల పెరుగుదల ద్వారా పాకిస్తాన్ ప్రయోజనం పొందుతుంది, అన్నింటికీ చైనా నిధులు సమకూరుస్తుంది. ఇలా బీఆర్ఐ వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. కానీ, అవేవీ వర్క్‌ఔట్ అయ్యే పరిస్థితులే లేవు. ఎందుకంటే, సీపెక్ ప్రాజెక్టుకు గుండె వంటి గ్వాదర్ పోర్టు ఆ రెండు దేశాలకూ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా మారింది. 2023లో గ్వాదర్ పోర్టుకు వచ్చిన వాణిజ్య నౌకల లెక్కే ఆ విషయం తేల్చి చెబుతోంది. గతేడాది గ్వాదర్‌కు కేవలం 17 నౌకలు మాత్రమే వచ్చాయంటేనే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌‌ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టులో పాల్గొనే ప్రతి దేశానికి ఆర్థికంగా, మౌలిక సదుపాయాలపరంగా బీఆర్‌ఐ ప్రయోజనం చేకూరుస్తుం దని పేర్కొన్నారు. వివిధ దేశాల మధ్య అనుసంధాన వ్యవస్థను, ఆర్థిక సంబంధాలను, వాణిజ్యాన్ని పెంపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే, దీనిపై గతేడాది ఇటలీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది. 2019లో జిన్‌పింగ్‌ రోమ్‌ పర్యటన సందర్భంగా అమెరికా, యూరప్ దేశాలను ఆశ్చర్యపరుస్తూ ఇటలీ బీఆర్‌ఐలో చేరింది.

మార్చి 2024 నాటికి ఈ ఒప్పంద గడువు ముగిసిం ది. అయితే, ఇటలీ రక్షణమంత్రి గుయిడో క్రొసెత్తో గతేడాది ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఐలో చేరాలని తమ దేశం తీసుకున్న నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించారు. బీజింగ్‌తో సంబంధాలు దెబ్బతినకుండా బీఆర్‌ఐ నుంచి బయటపడేందుకు తమ దేశం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టే బీఆర్ఐ నుంచి బయటకొచ్చేసింది ఇటలీ. దీంతో చైనీస్ ప్రాజెక్టులో భాగమైన ఏకైక యూరోపియన్ దేశం కూడా బయటకొచ్చేసినట్టయింది. అదే ఇటలీ భారత్ ప్రతిపాదించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇటలీ మాత్రమే కాదు.. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌పై మొదట ఉత్సాహం చూపించిన అనేక దేశాలు ఇప్పుడు దీన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నాయి. పారదర్శకత లోపించడం, పర్యా వరణ నష్టాల కారణంగా- బీఆర్‌ఐ కింద గతంలో అంగీకరించిన ప్రాజెక్టులను పునఃపరిశీలించి ఉపసంహరిం చుకోవాలని బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మలేసియా, సియెర్రా లియోన్‌ తదితర దేశాలు నిర్ణయించాయి. కొవిడ్ కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చైనా అనుసరించిన జీరో కొవిడ్‌ విధానం ఆ దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసింది. దాంతో బీఆర్‌ఐ ప్రాజెక్టుల్లో బీజింగ్‌ పెట్టుబడులకు అవకాశాలు కూడా దెబ్బతిన్నాయి.

బీఆర్‌ఐ చైనాకు మాత్రమే మేలు చేస్తుందని, చిన్న దేశాలను అప్పుల ఊబిలో ముంచే స్తుందని ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడే భారత్‌ ప్రపంచదేశాలను హెచ్చరించింది. చెప్పినట్టుగానే మన దేశం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోలేదు. ఇందులో చేరిన అనేక దేశాలు ఇప్పుడు అప్పుల్లో చిక్కుకుపోయాయి. బీఆర్‌ఐలో చేరే దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాణిజ్య కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టేందు కు, రుణాలు అందించేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. దాంతో పలు చిన్న దేశాలు ఈ ప్రాజెక్టులో చేరేందుకు అప్పట్లో ఆసక్తి చూపాయి.

నిజానికి.. ఇటలీ బీఆర్‌ఐలో చేరిన తరవాత దాని ఎగుమతులు 1450 కోట్ల యూరోల నుంచి 1850 కోట్ల యూరోలకు మాత్రమే పెరిగాయి. అదే సమయంలో చైనా నుంచి ఇటలీకి ఎగుమతులు 3350 కోట్ల యూరోల నుంచి 5090 కోట్ల యూరోలకు ఎగబాకాయి. ఇటలీ ఆశించిన పెట్టుబడులు చైనా నుంచి రాలేదు. శ్రీలంక, పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారింది. బీఆర్‌ఐలో భాగమైన చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌‌లో కారకోరం హైవేను పీవోకేలో నిర్మించాలన్న ప్రతిపాదనను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, చైనా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. సీపెక్‌పై సంతకం చేసినపుడు ఈ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసే గ్వాదర్‌ రేవును తమ దేశ ఆర్థిక భవిష్యత్తుగా పాకిస్తాన్‌ నాయకులు అభివర్ణించారు.

మరో దుబాయ్‌గా బలూచిస్తాన్‌ మారనుందని పేర్కొన్నారు. ఇప్పుడా అంచనాలు కూడా తప్పాయి. స్థానిక వనరులు చైనా చేతిలోకి వెళ్ళిపోవడం తప్ప బలూచీలకు ఈ ప్రాజెక్టువల్ల ఒరిగిందేమీ లేదు. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్‌ చైనా ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేదు. శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్ల లీజు పేరుతో చేజిక్కించుకున్నట్లు గ్వాదర్‌ను త్వరలో చైనా ఒడిసిపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బీఆర్‌ఐ అనేది భారత్‌ చుట్టూ చైనా పన్నిన చక్రవ్యూహంలో ఒక భాగమని మన దేశం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పేరుతో వివిధ దేశాలకు పెట్టుబడులు, రుణాలు సమకూర్చడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఆధిపత్యం సాధించాలన్నది చైనా వ్యూహం. దీన్ని గ్రహించిన చిన్న దేశాలు బీఆర్‌ఐ నుంచి బయటకు వచ్చేస్తే- చైనా ఎత్తుగడలు చిత్తవడం ఖాయం. ప్రస్తుతం జరుగుతోంది కూడా ఇదే. ఏదేమైనా ప్రపంచాన్ని శాసించాలని పగటి కలలతో నిర్మించుకున్న బీఆర్ఐ చివరకు డ్రాగన్ ఆర్ధిక వ్యవస్థకు కూడా గుదిబండగానే మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories