Water on Mars: అంగారక భూగర్భంలోనే నీరుంది - రిపోర్ట్

Water on Mars Still Trapped Underground
x
మార్స్ పై పరిశోధనలు చేస్తున్న రోవర్ (ఫోటో: ఫైల్ ఇమేజ్)
Highlights

Water on Mars: మార్స్ పై నీరందని.. లేదని కొన్ని అధ్యయనాలు వెలువడుతూనే ఉన్నాయి. మరి అసలు నీరు ఉంటే ఎలా ఉంది... ఎక్కడ ఉంది.

Mars Water: మార్స్ పై నీరందని.. లేదని కొన్ని అధ్యయనాలు వెలువడుతూనే ఉన్నాయి. మరి అసలు నీరు ఉంటే ఎలా ఉంది... ఎక్కడ ఉంది... మానవ జాతి మనుగడకు ఎంత మేర ఉపయోగపతుందని రెడ్ ప్లానెట్ ను శాస్త్రవేత్తలు జల్లెడ పడుతూనే ఉన్నారు. భవిష్యత్ తరాలకు నివాస యోగ్యంగా మార్స్ ను మార్చడంలో నీరు చాలా ముఖ్య మైన పాత్ర ఉంది. అయితే ప్రస్తుత విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం... రెడ్ ప్లానెట్ నీరంతా దాని అంతర్భాగంలోనే ఉందని అంటున్నారు.. ఆ వివరాలేంటో చూద్దాం...

మార్స్ పై ఉన్న నీటిలో దాదాపు 30 నుంచి 99 దాని భూగర్భంలోనే దాగుందని ఓ రిపోర్ట్ తెలిపింది. సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన, రెడ్ ప్లానెట్ పైన ఉన్న నీరు అంతరిక్షంలో కలిసిపోయిందనే సిద్ధాంతాన్ని సవాలు చేసేలా ఉంది.

కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్), నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) పరిశోధనా బృందం పరిశోధనల ప్రకారం.. సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రంలో మొత్తం గ్రహాన్ని(సుమారు 100 నుండి 1,500 మీటర్ల లోతులో) కప్పేంత నీటితో అంగారక గ్రహం ఉందని కనుగొన్నారు. అంటే భూమి మీద ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో సగభాగం ఉంటుందని పేర్కొన్నారు. కానీ, ఒక బిలియన్ సంవత్సరాల తరువాత, గ్రహంలోని నీరంతా మాయమై.. ఇప్పుడిలా పొడిగా తయారైందని తెలిపారు.

అంగారక గ్రాహం తక్కు గురుత్వాకర్షణకు గురవ్వడంతో.. దాని పై ఉన్న నీరంతా అంతరిక్షంలోకి ఆవిరైపోయిందని కొందరు శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే కొంత నీరు నిజంగానే అంగారక గ్రహాన్ని పై విధంగా వీడినప్పటికీ, కొంత నీరు మాత్రం దాని భూగర్భంలోనే దాగుందని ప్రస్తుత రిపోర్ట్ చెబుతోంది.

"వాతావరణ మార్పులతోనే నీటి నష్టం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే పురాతన హైడ్రేటెడ్ ఖనిజాలతో భారీ జలాశయం ఉందనే విషయాన్ని గత దశాబ్దపు మార్స్ మిషన్ల ద్వారా కనుగొన్నారు. దీంతో కాలక్రమేణా నీటి లభ్యత తగ్గిందని" అని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ బెథానీ ఎల్మాన్ వెల్లడించారు.

ప్రసుతం వచ్చిన రిపోర్ట్ తో రెడ్ ప్లానెట్‌ను మరింత లోతుగా పరిశీలించడానికి మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories