అమెరికాలో దారుణ పరిస్థితులు.. ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు

అమెరికాలో దారుణ పరిస్థితులు.. ఒక్క రోజే 10 వేల కేసులు నమోదు
x
Highlights

అమెరికాలో పరిస్థితి విషమించేలా కనిపిస్తోంది. కరోనా వైరస్‌తో ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. మంగళవారం ఒక్క రోజే యూఎస్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు...

అమెరికాలో పరిస్థితి విషమించేలా కనిపిస్తోంది. కరోనా వైరస్‌తో ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. మంగళవారం ఒక్క రోజే యూఎస్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 930కు చేరింది. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో మంగళవారం 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో న్యూయార్క్ లో మృతిచెందిన వారి సంఖ్య 201కి చేరింది. అక్కడ బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిన్‌, ఫ్లోరిడాలోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇక, తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో మాత్రం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. అమెరికా తాజా పరిస్థితిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఏప్రిల్ 12 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల గ్లౌజులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories