ఇరాన్ దూకుడుని ఎదుర్కోవడానికి... ఎఫ్-35 విమానాలను బయటకు తీసిన అమెరికా!

ఇరాన్ దూకుడుని ఎదుర్కోవడానికి... ఎఫ్-35 విమానాలను బయటకు తీసిన అమెరికా!
x
ఎఫ్-35
Highlights

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రతీకార పోరులో ఇరాన్‌ దూకుడు కొనసాగిస్తోంది. అమెరికా శిబిరాలపై మళ్లీ విరుచుకుపడింది. ఇరాక్‌లోని అమెరికా...

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రతీకార పోరులో ఇరాన్‌ దూకుడు కొనసాగిస్తోంది. అమెరికా శిబిరాలపై మళ్లీ విరుచుకుపడింది. ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో దాడి జరిగింది. ఇరాన్‌తో శాంతినే కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే రెండో దాడి చోటు చేసుకుంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అత్యంత పటిష్ఠమైన భద్రత, యూఎస్ తదితర దేశాల ఎంబసీలు ఉన్న గ్రీన్ జోన్‌పై ఇరాన్‌ రెండు రాకెట్లను ప్రయోగించింది. తాజా దాడులు కూడా సులేమానీ హత్యకు ప్రతీకారంగా జరిగినవేనని తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరాక్‌లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఇరాన్‌ దాడులను అమెరికా సీరియస్‌గా తీసుకుంది. అత్యాధునికమైన ఎఫ్-35 యుద్ధ విమానాలను బయటకు తీయాలని అమెరికా రక్షణశాఖ ఆదేశించింది. ఈ ఆదేశాలతో పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా వార్ షిప్‌లపై ఎఫ్-35లను మోహరింపజేయనున్నారు. వార్ షిప్ లపై ఫైటర్ జెట్స్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇరాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి అమెరికా సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలెన్ని..? వాటి బలగమెంత...? వాటి బలమెంత..?

ఇరాక్‌, సిరియా, ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రాంతాలు, సౌదీ అరేబియాకు సరిహద్దులో ఉన్న జోర్డాన్‌లో 3వేల మంది అమెరికా సైనికులున్నారు. ఐఎస్‌పై పోరు కోసం ఇక్కడి మువాఫక్‌ సాల్టీ వైమానిక స్థావరం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం కీలకమైంది. టర్కీలో 2వేల 500 మంది అమెరికా సైనికులు ఇన్‌క్రెలిక్‌ వైమానిక స్థావరంతో పాటు, నాటో దళాలున్న ప్రాంతాల్లో మోహరించారు. సిరియా-జోర్డాన్‌ సరిహద్దులోని టాన్ఫ్‌ వద్ద ఉన్న అమెరికా శిబిరం కీలకమైనది. ఇరాన్‌కు చెందిన, ఆ దేశానికి మద్దతిస్తున్న బలగాలు ఇక్కడికి సమీపంలో 3వేల మందిని మోహరించి ఉన్నాయి. ఇరాన్‌-సౌదీ అరేబియాల మధ్య ప్రాంతీయ వైరం ఉంది. దీంతో అక్కడ అమెరికాకు చెందిన 3వేల మంది సైన్యం మోహరించి ఉంటారు.

బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌, ప్రహరీ మధ్య ఉన్న దౌత్య ప్రాంతం, అల్‌-అసద్‌ వైమానిక స్థావరం సహా పలుచోట్ల 6వేల మంది అమెరికా దళాలున్నాయి. అఫ్ఘనిస్థాన్‌లో 14వేల మంది ఉన్నారు. సౌదీ అరేబియా, అమెరికాలతో వాణిజ్య సంబంధాలను యూఏఈ మెరుగు పరుచుకుంటోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories