అమెరికా అల్ల‌ర్లు : మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం

అమెరికా అల్ల‌ర్లు : మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం
x
Highlights

అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత...

అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్‌ని కూడా తాకింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు వైట్ హౌస్ వద్ద గుమికూడి నిరసనలకు దిగారు.

ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్‌ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్‌ నగరంలో మే 25న పోలీస్‌ కస్టడీలో ఫ్లాయిడ్‌ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన్ని చోట్ల హింసాత్మ‌కంగా మారాయి. అయితే వాషింగ్ట‌న్‌లోని భార‌తీయ దౌత్య‌కార్యాల‌యంలో.. గాంధీ విగ్ర‌హం ధ్వంసం కావ‌డం కూడా ఆందోళ‌న‌కారులు ప‌నే అని తేలింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories