భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై అమెరికా కీలక వ్యాఖ్యలు
x
Highlights

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. దీనిపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు..

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ వివాదం ప్రమాదకరమని ట్రంప్‌ పేర్కొన్నారు. వైట్ హౌస్ వద్ద విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇరు దేశాల సరిహద్దులో పరిస్థితి చాలా ప్రమాదకరమైనదని.. చైనా దానిని పెంచుతోందని అన్నారు. దీనిపై రెండు దేశాలకు సహాయం చేయాలనుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో భారత్, చైనా తో కూడా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ట్రంప్ ఇలా మాట్లాడారు.. నరేంద్ర మోడీ నా స్నేహితుడు, తెలివైన నాయకుడు. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు అన్నారు.. అంతేకాదు మోడీ పెద్ద నాయకుడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా అన్నారు.

ఫిబ్రవరిలో ఇండియా పర్యటన చాల మంచిగా జరిగిందని.. భారత ప్రజలు చాలా మంచివారని అన్నారు. అంతేకాదు హూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం కూడా అద్భుతమైనదని ట్రంప్ అభివర్ణించారు. తమకు భారతదేశం తోనే కాకుండా ప్రధాని మోదీ నుండి కూడా చాలా మద్దతు లభించిందని. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రజలు తనకె ఓటు వేస్తారని ఆయన నమ్మకంతో చెప్పారు. ఇదిలావుంటే అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న సుమారు 20 లక్షల హిందువుల ఓట్లు అధ్యక్షా ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కొన్ని రాష్ట్రాలలో హిందువుల ఓట్‌బ్యాంక్‌ చాలా ఎక్కువగా ఉంది. హిందూ అమెరికన్ల మద్దతు కోరుతూ రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలు విపరీతంగా కృషి చేయడం ఇదే తొలిసారి.

Show Full Article
Print Article
Next Story
More Stories