బాధ్యతారాహిత్యంగా అమెరికా తీరు.. సాయం చేసిన వారి జాబితా తాలిబన్లకు ఇచ్చిన..

US Officials Gave Taliban List of Afghans who Aided Americans
x

బాధ్యతారాహిత్యంగా అమెరికా తీరు.. సాయం చేసిన వారి జాబితా తాలిబన్లకు ఇచ్చిన..

Highlights

America: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉంది అమెరికా తీరు

America: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఉంది అమెరికా తీరు నిన్నటి బాంబు దాడులకు భయపడిన అమెరికా తమ సైనికుల తరలింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలిపెట్టబోమని పైకి గంభీర మైన ప్రకటనలు చేస్తున్న అమెరికా లోపల రివర్స్ గేమ్ ఆడుతోంది. తన సేఫ్టీ తాను చూసుకుంటోంది.

ఓపక్క నుంచి తమ సైన్యాన్ని , పౌరులను తరలిస్తూనే మరోవైపు నుంచి తాలిబన్లతో లోపాయికారీ ఒప్పందానికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆప్ఘన్ ను వీడి వెళ్లే ముందు తమకు సహకరించిన పౌరుల జాబితాను తాలిబన్లకు ఇచ్చేసింది. ఆ జాబితా పట్టుకుని అమెరికాకు సహకరించిన వారికోసం ఇంటింటికీ వెళ్లి తాలిబన్లు వెతుకుతున్నారు. దొరికిన వారిపై దాడులకు పాల్పడుతూ హింసిస్తూ కాల్పులు జరుపుతూ అరాచకానికి తెగబడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories