US Election 2020: అమెరికా అధ్యక్షుడిపై నెలకొన్న ఉత్కంఠకు తెర

US Election 2020: అమెరికా అధ్యక్షుడిపై నెలకొన్న ఉత్కంఠకు తెర
x
Highlights

US Election 2020: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని అమెరికా ఎలక్టోరల్ కాలేజ్...

US Election 2020: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని అమెరికా ఎలక్టోరల్ కాలేజ్ అధికారికంగా ధృవీకరించింది. నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌దే గెలుపు అని ధృవీకరించింది. దీంతో అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక యూఎస్ కాంగ్రెస్‌లో బైడెన్ గెలుపును సర్టిఫై చేయటంతో ట్రంప్ కూడా దిగొచ్చారు. ఇన్నాళ్లూ బైడెన్‌ విజయాన్ని తప్పుబడుతూ వస్తోన్న ఆయన ఎలక్టోరల్ కాలేజ్ నిర్ణయంతో అధికార మార్పిడికి అంగీకరించారు. ఈ నెల 20న అధికార మార్పిడికి సిద్ధమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories