అమెరికా ఎన్నికల్లో టఫ్‌ ఫైట్‌.. ఉత్కంఠ రేపుతోన్న ఫలితాలు

అమెరికా ఎన్నికల్లో టఫ్‌ ఫైట్‌.. ఉత్కంఠ రేపుతోన్న ఫలితాలు
x
Highlights

అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ దాదాపు తుదిదశకు చేరుకుంది. అభ్యర్థులు జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్ మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. స్వింగ్ రాష్ట్రాల్లో...

అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ దాదాపు తుదిదశకు చేరుకుంది. అభ్యర్థులు జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్ మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలపైనే అధ్యక్ష పీఠం ఎవరికనేది ఆధారపడటంతో ఇప్పుడు అందరి చూపు కీలక రాష్ట్రాల ఫలితాల వైపు తిరిగింది.

ఇప్పటివరకు బైడెన్‌ 238 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 213 ఓట్లు సాధించారు. కీలక రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. దీంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది.

స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌ మార్క్‌ కొనసాగుతోంది. ఇప్పటికే కీలక రాష్ట్రాల్లోని ఓహియో, ఫ్లోరిడా, టెక్సాస్‌లను కైవసం చేసుకున్నారు ట్రంప్‌. జార్జియాలోనూ ఆధిక్యం కనబరుస్తున్నారు.

అటు జో బైడెన్ కూడా తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు‌. కీలక రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామన్నారు. ప్రస్తుతం ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్న స్థానాలు కూడా తమకే దక్కుతాయన్న బైడెన్ అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు సమయం దగ్గర పడుతున్న వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ గెలుపు లాంఛనం అంటూనే కౌంటింగ్ ప్రక్రియను ఆపాలన్నారు. ఓట్ల లెక్కింపు ఆపాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమకు మద్దతుగా నిలిచిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories