తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బ్యాలెట్‌ ఓటింగ్‌కు విశేష స్పందన

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బ్యాలెట్‌ ఓటింగ్‌కు విశేష స్పందన
x
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ సారి ఓటర్లు కూడా చురుగ్గా పాల్గొంటున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ సారి ఓటర్లు కూడా చురుగ్గా పాల్గొంటున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఓటు హక్కు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రటిక్‌ మద్దతు దారులు అధికమని సర్వే చెబుతోంది. అలాగే ముందుగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో యువత అధికంగా పాల్గొన్నట్టు సర్వేలో తేలింది.

మరో వారం రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధికార రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది అమెరికన్లు మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది, సైన్యంలో పనిచేసే అధికారులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే సిబ్బంది, వృద్ధులు, ప్రముఖులు తదితరులు ఎన్నికల రోజు కాకుండా అంతకు ముందే తమ ఓటు హక్కును 'మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది.

2016లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఎక్కువగా వినియోగించుకున్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎక్కువ మంది అమెరికన్లు 'మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్‌' ఓటింగ్‌కే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తెలుస్తోంది. మరోవైపు బ్యాలెట్‌ ఓటింగ్‌ శాతం పెరగడంతో ఓట్ల లెక్కింపునకు మరింత ఎక్కువ సమయం పడుతుందని దీంతో ఫలితాల విడుదల కూడా ఆలస్యం కావచ్చని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories