H-1B Visa Fee Hike: భారత్‌పై కక్షతో అమెరికా తన గొయ్యి తనే తవ్వుకుంటుందా?

H-1B Visa Fee Hike: భారత్‌పై కక్షతో అమెరికా తన గొయ్యి తనే తవ్వుకుంటుందా?
x
Highlights

H-1B Visa Fee Hike: హెచ్ 1 బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధిగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్.

H-1B Visa Fee Hike: హెచ్ 1 బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధిగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్. అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టారీఫ్‌లు, విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్.... తాజాగా హెచ్1 బీ వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఏడాదికి లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 88 లక్షల రూపాయలు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాలపైన తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ విధానం అమెరికాకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది అంటూ పరోక్షంగా నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయంగా తెలియజేశారు. అమెరికా తన తలుపులను తానే మూసేసుకుంటోంది అంటూ హెచ్చరించారు. భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలను సృష్టించే విధంగా చేసిందంటూ తెలిపారు.

ఇప్పటికే అమెరికాలో ఈ వీసా పైన ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. అమెరికా బయట నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది. పలు రకాల ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కూడా వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సి ఉందంటూ హెచ్చరించారు. ట్రంప్ విధించిన నిర్ణయంపైన అమితాబ్ కాంత్ తన ట్విట్టర్ ద్వారా అమెరికాలో ఆవిష్కరణలను దెబ్బతీసి, భారత అభివృద్ధిని మరింత వేగవంతంగా చేసేలా ఉందంన్నారు.

ప్రపంచ స్థాయి ప్రతిభలకు ద్వారాలు మూసివేయడం ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్, ఆవిష్కరణలు, స్టార్టాప్‌లు... బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై సహా ఇతరత్ర ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే భారతదేశంలో అత్యుత్తమ ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, వికసిత భారత్ కలను సహకారం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశంగా మారబోతోంది. వీసాలపైన విధించినటువంటి ఈ నిర్ణయం అమెరికాకే నష్టం చేకూరుతుందంటూ అమితాబ్ కాంత్ క్లారిటీగా ఇచ్చేశారు. గూగుల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు.

అమెరికా కంపెనీలలో, అమెరికాలోని భారతీయ కంపెనీలలో హెచ్ 1 బీ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారి సంఖ్య లక్షలలో ఉంటుంది. ఇంత కాలం ఈ వీసాల ఫీజును భారత ఉద్యోగులు పని చేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి. ఇకపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండక పోవచ్చు. దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు. ట్రంప్ కోరుతున్నది కూడా అదే. అలా కాకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకపోతే... విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు... అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకుని... భారత్, చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనాలు, విశ్లేషణలూ కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్‌కే మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి.

తమతమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంత మాత్రం ఫీజబుల్ కాదనడంలో సందేహం లేదు. కనుక తొలుత ఉద్యోగుల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గిచుకున్నా... ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1 బీ వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతు గుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories