73మందికి ట్రంప్‌ క్షమాభిక్ష

Trump Pardons 73 Including Ex-Aide Steve Bannon
x
Highlights

అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు...

అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు చేసి వైట్‌హౌస్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బ్యానెన్‌తోపాటు 73మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 70మందికి శిక్షల్ని తగ్గించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు కోసం కృషి చేసిన వారిలో స్టీవ్‌ బ్యానెన్‌ అత్యంత ముఖ్యుడు.

రష్యాతో గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన వారిని కూడా ట్రంప్‌ క్షమించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ కాలం కాకుండానే స్టీవ్‌ బ్యానెన్‌కు విముక్తి కల్పించారు. కాగా సాధారణంగా అమెరికా అధ్యక్షులు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ఇస్తుంటారు. ప్రభుత్వాన్ని లాబీయింగ్‌ చేసిన కేసులో దోషిగా తేలిన తన అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ స్నేహితుడుని కూడా క్షమించారు.

ట్రంప్‌ ఆఖరినిమిషంలో వెనెజులా వలసదారులకి అండగా నిలిచారు. వేలాదిమంది వలసదారుల్ని వారి దేశానికి పంపకుండా అడ్డుకున్నారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న వారి అప్పగింతను మరో 18నెలల పాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో లక్షా 45వేల మందికిపైగా వెనెజులా వలసదారులు అమెరికాలో ఉండే అవకాశం లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories