పులికి క‌రోనా పాజిటివ్‌.. ఫస్ట్ కేసు..

పులికి క‌రోనా పాజిటివ్‌.. ఫస్ట్ కేసు..
x
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఒక జూలోని పులికి కూడా సోకింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషులకు మాత్ర‌మే ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతూ వ‌చ్చింది. అయితే...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఒక జూలోని పులికి కూడా సోకింది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌నుషులకు మాత్ర‌మే ఒక‌రి నుంచి ఒక‌రికి సోకుతూ వ‌చ్చింది. అయితే తాజాగా తొలిసారి జంతువుల్లో క‌రోనా వైర‌స్‌ను గుర్తించారు. అమెరికాలో ఇప్ప‌టికే క‌రోనా మ‌హమ్మారిపై పోరాటం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో..తాజాగా ఓ పులికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల మలయన్ అనే ఆడపులికి కరోనా సోకినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ వెటర్నరీ లాబరేటరీస్ సర్వీసెస్ టీం నిర్దారించింది.

వీటి సంరక్షణ చూసుకునే టీం‌కు కొన్ని రోజులుగా పులిలో మార్పులను గమనించారు. పొడిదగ్గు ఆకలి మందగించినట్టుగా ఉండటంతో ఈ విషయాన్ని వైద్య నిపుణులకుతెలిపారు. వెంటనే వారు వచ్చి పరీక్షించారు. అన్ని పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్టుగా తేలింది. వీటి సంరక్షణ చూసుకునే ఓ వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్నారు. మార్చి 16 నుంచి బ్రోంక్స్ జూలో సంద‌ర్శ‌కుల ప్ర‌వేశాన్ని నిషేధించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories