కరోనా మహమ్మారిని తరిమికొట్టిన జపాన్

కరోనా మహమ్మారిని తరిమికొట్టిన జపాన్
x
Highlights

ప్రపంచమంతా కరోనా వైరస్ వల్ల బిక్కుబిక్కుమని గడుపుతుంటే జపాన్ మాత్రం మహమ్మారిని తరిమికొట్టి స్వేచ్ఛా వాయువులను పీల్చుతోంది. అమెరికా సైతం ఎదురించలేని...

ప్రపంచమంతా కరోనా వైరస్ వల్ల బిక్కుబిక్కుమని గడుపుతుంటే జపాన్ మాత్రం మహమ్మారిని తరిమికొట్టి స్వేచ్ఛా వాయువులను పీల్చుతోంది. అమెరికా సైతం ఎదురించలేని కరోనా వైరస్‌ను జపాన్ సమర్థవంతంగా ఎదుర్కొని తన సత్తా చాటింది. లాక్‌డౌన్ ఎత్తేసి సాధారణ జీవితాన్ని మొదలుపెట్టింది. మరి జపాన్‌కు ఇది ఎలా సాధ్యమైంది? కోవిడ్-19ను వదిలించుకోడానికి ఏం చేసింది?

జపాన్ ప్రజలు లాక్‌డౌన్‌లో కూడా బయట తిరిగారు. వారిని పోలీసులు కొట్టలేదు, జరిమానాలూ విధించలేదు. అయినా సరే, కరోనాను కట్టడి చేశారు. నిత్యం విపత్తులతో సావాసం చేస్తూ ప్రతికూల పరిస్థితులతో పోరాడే జపాన్‌ కరోనా విసిరిన ఛాలెంజ్‌ను ధైర్యంగా స్వీకరించింది. చైనా కంటే మెరుగ్గా స్పందించిన జపాన్ జనవరి నెలలో మొదటి కేసు నమోదుకాగానే దేశాన్ని అప్రమత్తం చేసింది. అప్పటికే చైనా వైరస్‌ గురించి తెలుసుకున్న ప్రజలు ప్రభుత్వం చెప్పకుండానే మాస్కులు ధరించడం, పరిశుభ్రత నియమాలు పాటించడం మొదలుపెట్టారు. ఫలితంగా ఆ వైరస్ ఎక్కువ మందికి సోకకుండా కొంతమందితోనే ఆగిపోయింది.

ప్రజల్లో ఉన్న చైతన్యం, ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల కరోనా కేసులను ఎదుర్కోవడం జపాన్‌కు పెద్దగా కష్టమనించలేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు ప్రభుత్వం చేసిన హెచ్చరికలను తూ.చ. తప్పకుండా పాటించారు. నిత్యవసర వస్తువుల గురించి కంగారుపడలేదు. ప్రజలు వాటిని ఎప్పుడైనా సరే కొనుగోలు చేసుకోవచ్చని, ఎక్కువ సమయం ఇంట్లో ఉండటానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు సహకరించారు. పైగా జపాన్ చిన్న దేశమే కావడంతో తమకు అందుబాటులో ఉన్న వనరులన్నీ కరోనాను నియంత్రించేందుకే ఉపయోగించింది.

జపాన్ ప్రజలు మొదటి నుంచి పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. వైరస్‌లు రాకుండా మాస్కులు ధరించారు. ఇది కూడా జపాన్‌కు కలిసొచ్చింది. అలాగే, వైరస్ సోకిన వ్యక్తుల నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకుని బాధితులు కలిసిన వ్యక్తులపై కూడా నిఘా పెట్టారు. వారిని క్వారంటైన్లో ఉంచడం వల్ల ఇతరులకు వ్యాధి సోకకుండా నిలిచిపోయింది. తగినన్ని జాగ్రత్తలు పాటించిన జపాన్ వాసులు మహమ్మారిని తరిమికొట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ప్రభుత్వం ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో ప్రజలు తమ రోజువారీ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories