లేజర్ షోను మించిపోయేలా.. డ్రోన్ల షో

లేజర్ షోను మించిపోయేలా.. డ్రోన్ల షో
x
Highlights

లేజర్ షో అంటే తెలియని వాళ్లు ఎవరున్నారు. ఈ షోలో లేజర్ కిరణాలతో ఆకాశంలో వివిధ రూపాలను సృష్టిస్తారు. సెకన్ల వ్యవధిలో పలు ఆకృతులు రూపుదిద్దుతారు. ఈ...

లేజర్ షో అంటే తెలియని వాళ్లు ఎవరున్నారు. ఈ షోలో లేజర్ కిరణాలతో ఆకాశంలో వివిధ రూపాలను సృష్టిస్తారు. సెకన్ల వ్యవధిలో పలు ఆకృతులు రూపుదిద్దుతారు. ఈ షోను చూస్తేనే వీక్షకులు ఎంతో ఆశ్చర్య పోతారు. కానీ ఈ లేజర్ షోని మించిపోయే విధంగా చైనాలో మరో కొత్త షోని ప్రదర్శిస్తున్నారు. ఆ షోని చూస్తే ఇంకేముంది వీక్షకులు ఔరా అని ముక్కు మీద వేలేసుకుంటారు కావొచ్చు.

వివరాల్లోకెళితే నిత్యం ప్రదర్శించే లేజర్ షోకు ధీటుగా చైనాలో 800 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పదుల సంఖ్యలో డ్రోన్లను ఆపరేట్ చేయటమే ఎంతో కష్టంగా ఉన్న కాలంలో ఒకే సమయంలో పూర్తిగా 800 మంది డ్రోన్లను ఆపరేట్ చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు.

యుద్ధ విమానాలు, హెలికాప్టర్, మనిషి, జంతువులు, అక్షరాలు వంటి చాలా ఓ ఆకృతులను డ్రోన్లను వాడి ఆకాశంలో ప్రదర్శిస్తున్నారు. 800 మంది ఆపరేటర్లు ఎంతో కచ్చితత్వంతో ఈ డ్రోన్లను ఆపరేట్ చేసి ఆకాశంలో అద్భుత రూపాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సందర్శకులంతా ఆ విన్యాసాలను చేసే వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories