Suicide Bombing attack in Afghanistan: అఫ్గాన్‌‌లో ఆత్మాహుతి దాడి : ఏడుగురి మృతి

Suicide Bombing attack in Afghanistan: అఫ్గాన్‌‌లో ఆత్మాహుతి దాడి : ఏడుగురి మృతి
x
Suicide bombing attack in Afghanistan
Highlights

Suicide Bombing attack in Afghanistan: అఫ్గానిస్తాన్‌లో మంగ‌ళ‌వారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

Suicide Bombing attack in Afghanistan: అఫ్గానిస్తాన్‌లో మంగ‌ళ‌వారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఉగ్ర‌వాది కారు బాంబ‌ర్‌తో ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటనలో పోలీసు కమాండర్‌తో సహా నలుగురు అధికారులు మృతి చెందినట్లు స్థానిక అధికారి తెలిపారు. ఖేవా జిల్లాలోని ఒక మార్కెట్ వద్ద జరిగిన ఈ బాంబు దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది పౌరులు, ఇద్దరు భద్రతా దళ సభ్యులు ఉన్నారని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టాహుల్లా ఖోగ్యాని తెలిపారు. మృతులలో ఒకరు ఉన్నతాధికారి అయిన మీర్ జమాన్ గా గుర్తించారు. మిగతా ముగ్గురు అధికారులు జమాన్ కు అంగరక్షకులు అని తెలిపారు. అయితే ఈ దాడికి ఎవ‌రు పాల్ప‌డ్డార‌నే దానిపై అధికారిక స‌మాచారం లేదు.

గ‌త కొన్ని రోజులుగా తాలిబ‌న్ , ఇస్లామిక్ స్టేట్ గ్రూఫ్ ఆఫ్ఘ‌న్‌లో వ‌రుస దాడుల‌కుపాల్ప‌డుతున్నాయి. అంతకుముందు కూడా ఖేవా జిల్లాలోని ఐఎస్ సభ్యుడు ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 32 మంది మృతి చెందారు. 133 మంది గాయపడ్డారు. ఆ దాడిలో మరణించిన వారిలో ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్లా లాలా జాన్ కూడా ఉన్నారు. జిల్లాకు చెందిన నూర్ ఆఘా అనే చట్టసభ సభ్యుడు గాయపడ్డాడు. ఇదిలావుంటే కొంతకాలంగా ఆఫ్ఘన్ మిలిటరీ కూడా తాలిబాన్ లపై దాడులు చేస్తోంది.. అయితే ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ వివరాలు ఇవ్వడానికి మాత్రం నిరాకరిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories