సుదీక్ష అదృశ్యం వెనుక అనేక అనుమానాలు.. సముద్రంలో హెలీక్యాప్టర్లు, డ్రోన్లతో గాలింపు

Sudiksha Konanki, an Indian-origin student from US went missing in Dominican Republic holiday spot
x

విహార యాత్ర కోసం వెళ్లిన సుదీక్ష ఏమైనట్లు? ఆమెతో పాటు కనిపించిన యువకుడు ఎవరు? సముద్రంలో హెలీక్యాప్టర్లు, డ్రోన్లతో గాలింపు

Highlights

Sudiksha Konanki latest news updates: డామినికన్ రిపబ్లక్ హాలీడే కోసం వెళ్లి అదృశ్యమైన సుదీక్ష కోనంకి ఎవరు?

Who is Sudiksha Konanki: భారతీయ సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోనంకి డామినికన్ రిపబ్లిక్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్లి అదృశ్యమయ్యారు. ఈ 20 ఏళ్ల ప్రీ మెడిసిన్ స్టూడెంట్ అదృశ్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. సుదీక్ష కోనంకి తండ్రి సుబ్బా రాయుడు కోనంకి. తెలుగు నేపథ్యం ఉన్న ఈ కుటుంబం 2006 లో అమెరికా వెళ్లి వర్జీనియాలో స్థిరపడింది. వారికి అమెరికాలో పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ కూడా ఉంది.

డామినికన్ రిపబ్లిక్‌కు సుదీక్ష

సుదీక్ష కోనంకి అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు. డాక్టర్ కావాలనేది ఆమె లక్ష్యం. మార్చి 6న తన మిత్రబృందంతో కలిసి కరీబియన్ దీవుల్లోని డామినికన్ రిపబ్లిక్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్లారు. పుంటా కెనాలోని రియు రిపబ్లిక రిసార్ట్ హోటల్లో బస చేశారు. హోటల్‌కు సమీపంలోని బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. అక్కడి సీసీటీవీ దృశ్యాల ప్రకారం మిగతా స్నేహితులు అందరూ వచ్చినప్పటికీ సుదీక్ష కోనంకి, మరో యువకుడు మాత్రం బీచ్‌లోనే ఉండిపోయారు.

చివరిసారిగా ఆమె ఎప్పుడు కనిపించిందంటే..

తెల్లవారిజామున 4:15 గంటలకు చివరిసారిగా బీచ్‌లో ఆమె ఆ యువకుడితో కలిసి నడుస్తున్న దృశ్యాలు రికార్డ్ అయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఉదయం 9:55 గంటలకు ఆ యువకుడు ఒక్కడే బీచ్ నుండి వెళ్లిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందన్నారు. ఆ తరువాతి నుండి సుదీక్ష ఇక కనిపించలేదు. అక్కడ ఏం జరిగింది? సుదీక్ష ఎలా మిస్ అయ్యారన్నదే ప్రస్తుతానికి పెద్ద మిస్టరీగా మారింది.

అదంతా కట్టుకథే అంటున్న సుదీక్ష కుటుంబం

సుదీక్ష కోనంకి బీచ్‌లో నడిచిన తరువాత ఈతకు వెళ్లారని, అక్కడ అలల ధాటికి ఆమె కొట్టుకుపోయి ఉంటారనే వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలను ఆమె కుటుంబం కొట్టిపారేస్తోంది. ఆ ప్రచారంలో నిజం లేదని, ఇంకేదో జరిగిందని ఆ కుటుంబం ఆందోళన వ్యక్తంచేస్తోంది. తన కూతురు చాలా తెలివిగల అమ్మాయని, డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదువుకుంటున్నారని ఆమె తండ్రి సుబ్బా రాయుడు చెప్పినట్లుగా సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది.

సముద్రంలో హెలీక్యాప్టర్లు, డ్రోన్లతో జల్లెడ పడుతున్న పోలీసులు

సుదీక్ష కోసం సముద్రంలో, సముద్రం ఒడ్డున డామినికన్ రిపబ్లిక్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. హెలీక్యాప్టర్లు, డ్రోన్స్, బోట్లు ఉపయోగించి సముద్రంలో సుదీక్ష ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇంతకీ సుదీక్షతో పాటు కనిపించిన ఆ యువకుడు ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా ఆ యువకుడిని పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నప్పటికీ ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పారనే విషయంలోనూ క్లారిటీ లేదు.

సుదీక్ష కోనంకి ఆచూకీ కోసం గాలించే క్రమంలో ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోలీసులు, స్నేహితులు

సుదీక్ష చివరిసారిగా ధరించిన దుస్తులు, ఆమె వేషధారణను తెలిపే ఫోటోను స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె ఆచూకీని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

సుదీక్ష కోసం గాలింపులో ఆమె చదువుకుంటున్న పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ, వర్జీనియా పోలీసులు, డామినికన్ రిపబ్లిక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, భారత రాయబార కార్యాలయం కలిసి పనిచేస్తున్నాయి. వర్జీనియా గవర్నర్ గ్లెన్ యాంకిన్ కూడా సుదీక్ష ఆచూకీ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై స్పందిస్తూ ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories