మాస్క్ ను కంటికి తగిలించుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

మాస్క్ ను కంటికి తగిలించుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
x
South Africa President Cyril Ramaphosa
Highlights

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కు సంబందించిన సరదా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కు సంబందించిన సరదా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇందులో, కరోనాను అడ్డుకోవడానికి ఆయన మాస్కు ధరించారు. అయితే ఆ మాస్కు పదేపదే జారిపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. దాంతో వెంటనే దానిని ధరించడానికి ప్రయత్నిస్తున్నాడు.. కానీ ప్రతిసారీ అది జారిపోవడం, ఆఖరికి అది కళ్ళకి తగిలించుకోవడం జరిగిపోయాయి. అధ్యక్షుడు మీడియా సమావేశానికి వచ్చిన జర్నలిస్టులు ఈ సన్నివేశం చూసి పకపకా నవ్వారు.

రమాఫోసా కూడా ఈ మాస్కు ధరించడం చాలా కష్టమని సరదాగా సంభాషిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. వాస్తవానికి వచ్చే నెల నుండి దేశవ్యాప్త లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టం చేశారు ఆయన. ప్రజలు ఇంట్లోనే ఉన్నా మాస్కులు ధరించాలని.. తద్వారా కరోనా నుంచి రక్షించుకోవాలని ఆయన సూచించారు. అయితే తన ప్రసంగం చివరలో ప్రజలకు ఇది ఎంత సులభమో చూపించడానికి మాస్క్ ను ధరించాలని అనుకున్నాడు. కానీ అది ఇలా జారిపోవడంతో నవ్వులుపువ్వులు పూయించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories