Top
logo

అమెరికాను అతలాకుతలం చేస్తున్న మంచు తుపానులు

అమెరికాను అతలాకుతలం చేస్తున్న మంచు తుపానులు
X

అమెరికాను అతలాకుతలం చేస్తున్న మంచు తుపానులు

Highlights

*ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మంచు తుపానులు *న్యూహాంప్‌షైర్‌లో అడుగు మేర పేరుకుపోయిన మంచు

అమెరికా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర మంచు తుపానులతో అల్లాడుతున్నారు. మంచు తీవ్రతకు రెండు రోజులుగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో.. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా మయిన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కూరుకుపోయాయి.

మరోవైపు.. న్యూజెర్సీలో 76 సెంటీమీటర్ల మేర, మన్‌హట్టాన్ సెంట్రల్ పార్కులో 43 సెంటీమీటర్ల మేర మంచు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు.. న్యూహాంప్‌షైర్‌లో అడుగు మేర మంచు పేరుకుపోయింది. ఈ మంచు తుపాను కారణంగా న్యూజెర్సీలో 6 వందలకు పైగా వాహన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రానున్న రెండు వారాలపాటు ఇదే పరిస్థితి ఉండనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Web Titlesnow storm in America
Next Story