లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కాల్చిపారేయండి.. లేదంటే నేను మిమ్మల్ని..

లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కాల్చిపారేయండి.. లేదంటే నేను మిమ్మల్ని..
x
Highlights

కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ కూడా లాక్‌డౌన్ విధించింది. కానీ ప్రజలు వాటిని లెక్క చేయకుండా...

కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ కూడా లాక్‌డౌన్ విధించింది. కానీ ప్రజలు వాటిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా బయట కనిపిస్తే కాల్చివేయాలంటూ ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్డే సంచలన ఆదేశాలు జారీ చేశారు.

ఎవరు లాక్‌డౌన్ పాటించకున్నా వెంటనే కాల్చిపారేయండంటూ పోలీసులకు, ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ఆర్మీకి నా ఆదేశాలు .లాక్ డౌన్ లో కఠినంగా ఉండండి. లేదంటే మీరు ప్రమాదంలో పడతారు. హోం క్వారంటైన్ లో ఉండకుండా ఇబ్బందులు గురి చేస్తే కాల్చిపారేయండి. అర్ధమైందా..? లేదంటే నేను మిమ్మల్ని పాతిపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు రోడ్రిగో డ్యూటెర్డే.

Show Full Article
Print Article
Next Story
More Stories