జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే రాజీనామా !

జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే రాజీనామా !
x
Highlights

Shinzo Abe: జపాన్‌ ప్రధాని షింజో అబే రాజీనామా చేశారు. తీవ్ర అనారోగ్యం వల్లనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని పదవి...

Shinzo Abe: జపాన్‌ ప్రధాని షింజో అబే రాజీనామా చేశారు. తీవ్ర అనారోగ్యం వల్లనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ప్రజలను పాలించే స్థితిలో లేను. అందుకే ఇకపై ఆ పదవిలో కొనసాగకూడదని అనుకున్నాను. కరోనా వైరస్‌ క్లిష్టకాలం, పలు విధాన నిర్ణయాలు అమలు దశకు రాకముందే, ఏడాది పాటు పదవీకాలం మిగిలుండగానే.. రాజీనామా చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని ముందుకు వంగి ప్రజలను అభ్యర్థించారు. షింజో అబే వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న షింజో అబే రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆయన గత కొన్నేళ్లుగా అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతున్నారని తెలిపింది. షింజో అబే పదవీ కాలం 2021 సెప్టెంబరుతో ముగియాల్సి ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories