ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..

Sexual Harassment Claim Against Elon Musk
x

ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి.. 

Highlights

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపాయి.

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపాయి. విమానంలో వెళ్తూ ఎయర్‌ హోస్టెస్‌ను మస్క్‌ లైంగిక వేధింపులకు గురి చేశారని సదరు యువతికి 2 లక్షల 50వేల డాలర్లు చెల్లించి నోరు మూయించినట్టు అమెరికాకు చెందిన బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారాన్ని 2018లో స్పేస్‌ఎక్స్‌ సెటిల్‌ చేసినట్టు తెలిపింది. స్పేస్‌ఎక్స్‌ కార్పొరేట్‌ జెట్‌ విమానాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పని చేసే మహిళ ఈ ఆరోపణలు చేసింది. ఎయిర్‌ హోస్టెస్‌ కాలును మస్క్‌ అమె సమ్మతి లేకుండా తాకి అభ్యంతరకరంగా వ్యవహరింనట్టు ఆరోపించింది. ఫ్లయిట్‌ అటెండెంట్‌ బాధితురాలి వాదనకు మద్దతుగా డిక్లరేషన్‌లో ఈ వివరాలు ఉన్నట్టు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ తెలిపింది.

2016లో గ‌ల్ఫ్‌స్ట్రీమ్ జీ650ఈఆర్‌లో మ‌స్క్ ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. విమానంలోని ప్రైవేట్ రూంకు తనను పిలిచి ఫుల్ బాడీ మ‌సాజ్ చేయాల‌ని కోరిన‌ట్టు బాధిత ఎయిర్‌ హోస్టెస్‌ వెల్ల‌డించింది. ఆమె మ‌స్క్ రూంకు వెళ్ల‌గా అప్పటికే న‌గ్నంగా మారి త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్రవర్తించినట్టు ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించింది. తాను చెప్పిన‌ట్టు చేస్తే త‌న‌కు గుర్రాన్ని కొనిస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ని పేర్కొంది. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపుల గురించి మ‌స్క్‌ను ప్ర‌శ్నించ‌గా అది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని తోసి పుచ్చాడు. తాను లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే 30 ఏళ్ల తన కెరీర్‌లో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఇప్పుడు బయటకు వచ్చేవి కావని స్పష్టం చేశారు.

ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా ఎన్నికలపై ప్రస్తావించారు. ఈసారి తన మద్దతు రిపబ్లికన్లకేనని డెమొక్రాట్లకు ఓటేయనని తేల్చి చెప్పారు. డెమొక్రాట్లు అంటే సౌమ్యంగా ఉండేవారని అందుకే గతంలో వారికి ఓటేశానని మస్క్‌ తెలిపారు. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా మారుతోందన్నారు. అందుకే ఇక నుంచి తాను వారికి మద్దతు ఇవ్వనన్నారు. ఇక ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఎలా చెడు ప్రచారం చేస్తారో చూడండంటూ జోబైడెన్‌ పార్టీని ఉద్దేశించి ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. జోబైడెన్ ప్రభుత్వంపై తరచూ ఎలాన్‌ మస్క్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల పన్నల విధానం విషయంలో బైడెన్‌ ప్రభుత్వం తీరును తప్పబడుతున్నారు. అయితే రిపబ్లికన్లకే ఓటేస్తానని ప్రకంటించిన కొన్ని గంటలకే ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం గమనార్హం.


Show Full Article
Print Article
Next Story
More Stories