విదేశాల్లో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు

Serial deaths of Indian students In abroad
x

విదేశాల్లో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు 

Highlights

కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్‌ గోయల్‌ హత్య

విదేశాల్లో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కెనడాలో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువరాజ్‌ గోయల్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 7న సుర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే యువరాజ్‌ గోయల్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుర్రే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. యువరాజ్‌ గోయల్‌ స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానా. 2019లో స్టూడెంట్‌ వీసాపై కెనడా వెళ్లాడు. అతడు బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సుర్రే ప్రాంతంలో కార్‌ డీలర్‌షిప్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. ఇటీవలే అతడికి కెనడియన్‌ శాశ్వత నివాస అర్హత అనుమతి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories