యుద్ధంపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. యుద్ధాన్ని ఆపేది లేదని మరోసారి స్పష్టం

Russian President Vladimir Putin Responds to the War | Telugu News
x

యుద్ధంపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. యుద్ధాన్ని ఆపేది లేదని మరోసారి స్పష్టం

Highlights

Vladimir Putin: డాన్‌బాస్‌లో శాంతిస్థాపనే ధ్యేయమన్న పుతిన్

Vladimir Putin: ప్రపంచ దేశాలు ఆగ్రహాన్ని, కఠిన ఆంక్షలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ లైట్‌ తీసుకుంటున్నారు. మీరు ఏమైనా చేసుకోండి. నేను మాత్రం తగ్గేదేలే అంటూ పుతిన్‌ ఉక్రెయిన్‌ యుద్ధంపై మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఆంక్షలు ఎన్ని విధించినా తమను ఎవరూ ఏకాకుల్ని చేయాలేరని మరోసారి స్పష్టం చేశారు. డాన్‌బాస్‌ ప్రజలకు సాయం చేయడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సమర్థించుకునేందుకు మళ్లీ పుతిన్‌ పాత పాటే పాడారు. మరోవైపు ఉక్రెయిన్‌లో మాస్కో సేనలు సృష్టించిన ఆరాచకాలను చూసిన తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీవ్రంగా స్పందిచారు. రష్యా బలగాల అరాచకాలను నరమేథంతో పోల్చారు. పుతిన్‌ నరహంతకుడు అంటూ బైడెన్‌ తాజాగా ఆరోపించారు.

ఉక్రెయిన్‌ యుద్ధం ఏడు వారాలుగా సాగుతోంది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు పూర్తిగా శిథిలమయ్యాయి. దొరికిన మృతహాల లెక్కలు మాత్రమే చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకెంత మంది మృతదేహాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. కీవ్‌, చెర్నిహైవ్‌ ప్రాంతాల నుంచి రష్యా సైన్యం వెనక్కి వెళ్లినా.. దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్‌ను మాత్రం వీడలేదు. ఇప్పటికీ ఆ నగరాన్ని మాస్కో బలగాల కబంధ హస్తాల్లోనే ఉంది. అయితే తాజాగా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. యుద్ధాన్ని ఆపేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌ సైనిక చర్యపై పాత పల్లవినే వల్లించారు. డాన్‌బాస్‌ ప్రాంతంలో శాంతి నెలకోల్పడేమే ధ్యేయమని పుతిన్‌ స్పష్టం చేశారు. తమను ఎవరూ ఏకాకిని చేయలేరని.. తమ వంటి పెద్ద దేశాలతో అధి సాధ్యం కాదన్నారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలకే ఎదురుదెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. తాము ఎగుమతులు నిలిపేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరుగుతాయని, ఆంక్షలు విధించే ముందు ఆలోచించాలని పుతిన్‌ హితవు పలికారు.

దక్షిణ ఉక్రెయిన్‌లోని మారియూపోల్‌పై పూర్తి పట్టు సాధించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మారియూపోల్‌పై బాంబుల వర్షం కురిపించిన మాస్కో బలగాలు నగరాన్ని నేలమట్టం చేశాయి నగరంలోని 80 శాతం భవనాలు శిథిలమయ్యాయి. ఇప్పటి వరకు ఈ నగరంలో 10వేల మంది మృతి చెందినట్టు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే తాజాగా మారియూపోల్‌లో రష్యా రసాయన దాడులకు పాల్పడిందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలు లక్ష్యంగా విష పదార్థాన్ని జారవిడిచి నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని శ్వాసకోస సమస్యలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రసాయన దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ధ్రువీకరించలేదు. యుద్ధంతో తాము తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో రష్యా ఇలా కొత్తగా భయపెట్టేందుకు యత్నిస్తున్నట్టు జెలెన్‌స్కీ ఆరోపించారు. అయితే మారియూపోల్‌లో వెయ్యి 26 మంది సైనికులు చ్ఛందంగా లొంగిపోయినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దురాగతాలపై అమెరికా స్వరం పెంచింది. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ మాస్కో దళాల క్రూరత్వాన్ని నరమేధంతో పోల్చారు. పుతిన్‌ యుద్ధ నేరస్థుడని నరహంతకుడని తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను కూకటవేళ్లతో సహా పెకిలించి వేసేందుకు మాస్కో అధినేత ప్రయత్నిస్తున్నట్టు బైడెన్‌ ఆరోపించారు. రష్యా అరాచకాలపై ఎన్నో ఆధారాలు బయటపడుతున్నాయన్నారు. అయితే రష్యా దళాల చర్యలను గతంలో యుద్ధ నేరాలుగానే బైడెన్‌ పేర్కొన్నారు. తాజాగా నరమేధం అనే పదం వాడడం విశేషం. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా తీరులో మార్పులు వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న దారుణాలపై అమెరిక్ల అభిప్రాయాలకు బైడెన్‌ ప్రీకగా నిలుస్తున్నారు. తాజాగా బైడెన్‌ చేసిన వ్యాఖ్యలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మద్దతు లభించింది. నిజమైన నాయకుడి నుంచి సరైన వ్యాఖ్యలు వచ్చాయన్నారు. రష్యన్లను అడ్డుకోవడానికి మరిన్ని ఆయుధాలు ఇవ్వాలంటూ ట్విట్టర్‌లో జెలెన్‌స్కీ కోరారు.

రష్యాకు చెందిన ధనవంతుడు, పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన విక్టర్‌ మెద్వేద్‌చుక్‌ తమకు పట్టుబడినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుద్దంలో పట్టుబడిన తమ సైనికులను వదిలేస్తే మెద్వేద్‌చుక్‌ను వదిలేందుకు తాము సిద్ధమని చెప్పారు. మెద్వేద్‌చుక్‌ ఫొటోను టెలిగ్రామ్‌లో జెలెన్‌స్కీ విడుదల చేశారు. ఆర్మీ సూట్‌లో ఉన్న మెద్వేద్‌చుక్‌ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. దీనిపై క్రెమ్లిన్‌ స్పందించింది. ఆ ఫొటో నిజమైనదో కాదు తెలియదని స్పష్టం చేసింది. జెలెన్‌స్కీ డిమాండ్‌పై మాత్రం రష్యా నుంచి స్పందన లేదు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత తొలిసారి పుతిన్‌ మాస్కో వెలుపల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో చర్చలు జరిపారు. అనంతరం వోస్తోస్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించడం విశేషం.

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా సైనిక చర్యగా పేర్కొంటోంది. అయితే ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు మాత్రం ఆక్రమణగా పేర్కొంటున్నాయి. ఏదేమైనా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories