మానసిక ఒత్తిడిలకు సమాధి చికిత్స.. బతికుండగానే ఎందుకు సమాధి చేస్తారు?

Russian Company Will Charge You 47 Lakhs To Be Buried Alive
x

మానసిక ఒత్తిడిలకు సమాధి చికిత్స.. బతికుండగానే ఎందుకు సమాధి చేస్తారు?

Highlights

Buried Alive: మనో వ్యాధికి మందే లేదంటారు. మానసికంగా బాగా దెబ్బతిన్న వారు.. కొన్ని సార్లు ఆత్మహత్యా యత్నం కూడా చేస్తుంటారు.

Buried Alive: మనో వ్యాధికి మందే లేదంటారు. మానసికంగా బాగా దెబ్బతిన్న వారు.. కొన్ని సార్లు ఆత్మహత్యా యత్నం కూడా చేస్తుంటారు. మరికొందరు మాత్రం మానసికంగా బాధపడేవారిని మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్తుంటారు. మానసికంగా తీవ్రంగా క్రుంగిపోయిన వారిని మామూలు మనుషులను చేయడానికి అష్టకష్టాలు పడుతుంటారు. అయితే వాటన్నింటికి గంటలో పరిష్కరిస్తామంటుంది రష్యాకు చెందిన ప్రికెటెడ్‌ అకాడమీ అందుకు వినూత్న థెరపీని తెరపైకి తెచ్చింది. బతికున్న మనిషిని సమాధి చేసి వారి మానసిక ఇబ్బందులను తరిమికొడతామని చెబుతోంది. అందుకు మానిసిక రోగులకు సంప్రదాయ బద్దంగా బతికిండగానే సమాధి చేస్తారు. ఇప్పుడు ఈ ఖనన థెరపీకి రష్యాలో మంచి క్రేజ్‌ ఏర్పడింది.

ఆధునిక కాలంలో మనిషికి శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో కొందరు విపరీతంగా ఆలోచించి ఆత్మహత్యలకు కూడా వెనుకాడరు. కొందరు డిప్రెషన్‌ను గుర్తించి మానసిక వైద్యుల దగ్గరకు వెళ్తుంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు రకరకాల పద్దతులను చెబుతారు. ఆ పద్దతులను పాటించి కొందరు ఒత్తిడిని అధిగమించి మళ్లీ మాములవుతారు. కానీ మరికొందరు మాత్రం మానసికంగా మరింత క్రుంగి పోతారు. ఇలాంటి వారికి రష్యాలో వెరైటీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆ చికిత్స విధానం అద్భుతమైన టెక్నిక్‌ అంటున్నారు. ట్రెస్‌ థెరపీ పేరుతో ఇప్పుడు ఓ స్టార్టప్‌ కంపెనీ రష్యాలో తెగ ఫేమస్ అయ్యింది. ఎందుకంటే అది చికిత్సనందించే థెరపీ మామాలుగా ఉండదు. ఇంతవరకు ఎవరూ ఊహించని థెరపీని ఆ స్టార్టప్ కంపెనీ ప్రారంభించింది. అందుకు జనాల నుంచి కూడా స్పందన వస్తోంది. ఇప్పుడు ఆ థెరపీకి మంచి గీరాకి పెరిగిందట. ఇంతకు స్టార్టప్‌ కంపెనీ ఇచ్చే థెరపీ ఏమిటి? మానసిక సమస్యలకు ఎలా చెక్‌ పెడుతోంది? ఆ చికిత్సకు ఎంత డబ్బు వసూలు చేస్తోంది?

దెబ్బకు దెయ్యం కూడా వదిలిపోతుందన్నది నానుడి.. ఈ నానుడిని రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన చెందిన ప్రికెటెడ్‌ అనే స్టార్టప్‌ కంపెనీకి బాగా తెలిసొచ్చింది. దెయ్యాలను కూడా పారదోలే ఐడియా ఈ స్టార్టప్‌ కంపెనీకి వచ్చేసింది. అనుకున్న వెంటనే అమలుకు శ్రీకారం చుట్టింటి. ఇంతకు స్టార్టప్‌ కంపెనీకి వచ్చిన ఐడియా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఏ వైద్యానికి నయం కాని మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సనందిస్తుంది. అంతేకదా ఇందులో ఆశ్చర్యపోయేది ఏముందని అనుకుంటున్నారా?.. అందులోనే ఉంది అసలు ట్రిక్కు. మనిషి డిప్రెషన్‌ను తగ్గించేందుకు బతికుండగానే సమాధి చేస్తారు. జీవసమాధి అనుకుని తప్పులో కాలేస్తారేమో అది ఏ మాత్రం కాదు.. అదొక థెరపీ మాత్రమే. భయం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోగులకు అంత్యక్రియలను నిర్వహిస్తుంది బతికుండగానే ఖననం చేస్తుంది. గంటపాటు సజీవంగా సమాధి చేసిన అనుభూతిని అందిస్తుంది. ఈ సమాధి సమయంలో సాధారణంగా అంత్యక్రియలను ఎలా చేస్తారో అలాంటి వాతావరణాన్ని మొత్తం సిద్ధం చేశారు. క్యాండిళ్లను వెలిగించి ప్రార్థనలు, గీతాలను ఆలపిస్తారు. పేషెంట్లను సామూహికంగా ఖననం చేస్తారు. గంట తరువాత వారిని తిరిగి బటయకు తీసుకొస్తారు.

ఈ అంత్యక్రియల ప్రక్రియను ఆన్‌లైన్‌లో చూసే ఫెసిలిటీ కూడా ఉంది. ఈ థెరపీతో భయం, ఒత్తిడిని రోగులు అధిగమిస్తారని ఆందోళనలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని ప్రికెటెడ్‌ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ థెరపీని ఉచితంగా ఏ మాత్రం చేయరు. అత్యంత ఖరీదైన ఈ థెరపీలకు లక్షలాది రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇందులో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయని ప్రికెటెడ్‌ కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఉన్న ప్యాకేజీలతో పాటు అత్యధిక ఖర్చుగల ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఇందులో గరిష్ఠ ధర పలికే పాకేజీ మాత్రం 47 లక్షల రూపాయలు. రష్యాలోని మానసికంగా బాధపడేవారు భారీగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ థెరపీ చేయించుకున్న వారు తాము ఇప్పుడు సంతోషంగా ఉన్నామని మానసిక సమస్యల నుంచి బయటపడ్డామని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. చావునే చూసొచ్చామని.. ఇక.. అంతకంటే ఏముంటుందనే భావన వస్తోందంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ థెరపీకి విపరీతమైన స్పందన వస్తోంది. మనిషి జీవితంలో అత్యంత కీలకమైన అంత్యక్రియల ప్రక్రియను చూసిన తరువాత చాలా మందికి సహజంగానే వైరాగ్యం వచ్చేస్తోంది. శ్మశానం నుంచి బయటకు రాగానే మళ్లీ మామూలుగా మారుతారు.

అయితే ఇలాంటి ఖనన చికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి మాత్రం కాదు. ఇలాంటి ప్రక్రియ దక్షిణ కొరియాలోనూ పాటిస్తారు. 2012లోనే హ్యోవాన్‌ హీలింగ్‌ సెంటర్‌ ఇలాంటి ఖనన చికిత్సను ప్రారంభించింది. యుక్త వయస్కుల నుంచి పదవీ విరమణ పొందిన వారి వరకు దక్షిణ కొరియా సంప్రదాయం ప్రకారం.. బతికున్న వారికే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే ప్రికెటెడ్‌ అకాడమీ లాగా గంట సేపు ఇందులో ఉంచరు. దక్షిణ కొరియాలో కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే ఈ ప్రక్రియను ఉంటుంది. హ్యోవాన్‌ హీలింగ్‌ సెంటర్‌కు ఏటా వేలాది మంది హాజరవుతుననారు. ఖనన చికిత్స ద్వారా తమ ఒత్తిడిని అధిగమించి మునపటిలాగే జీవితాన్ని ఆశ్వాధిస్తామంటూ దక్షిణ కొరియాకు చెందిన పలువురు పేర్కొంటున్నారు. ఈ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు దక్షిణ కొరియాకు చెందిన వైద్యులు. పలువురు జీవితంలో విజయం సాధిస్తున్నట్టు వివరిస్తున్నారు. దక్షిణ కొరియాలో పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా యువత ఉపాధి లభించదని తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. అలాంటి వారికి హ్యోవాన్‌ హీలింగ్‌ సెంటర్‌ మంచి దారి చూపుతుందని దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. అంతేకాదు ఇక్కడ ఇది ఓ పెద్ద వ్యాపారంగా కూడా మారింది.

మానసిక వైద్యానికి ఖనన థెరపీ అన్నది మాత్రం వినూత్నమే. ఇది చాలామందికి తెలియదు. ఉత్తర కొరియాలో నామమాత్రపు ఫీజులను వసూలు చేస్తున్నారు. కానీ రష్యాలో మాత్రం ప్రికెటెడ్‌ అకాడమీ మాత్రం ప్యాకేజీలను బట్టి డబ్బు వసూలు చేస్తోంది. రెండింటికీ మంచి క్రేజ్‌ లభిస్తుండడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories