Russia Ukraine War: రష్యా చానళ్లపై యూట్యూబ్‌ నిషేధం

Russia Ukraine Crisis YouTube Blocks Monetisation For Russian Channels
x

Russia Ukraine War: రష్యా చానళ్లపై యూట్యూబ్‌ నిషేధం

Highlights

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా వేదికలు కూడా స్పందిస్తున్నాయి. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. యూట్యూబ్‌లో రష్యా మీడియాకు సంబంధించిన వ్యాపార ప్రకటనలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా టుడేతో సహా యూట్యూబ్‌లో డబ్బును ఆర్జించే అనేక చానళ్లను నిషేధిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది.

రష్యా మీడియా ఆదాయ వనరులను నిలిపేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ సెక్యూరిటీ పాలసీ హెడ్‌ నథానియల్‌ గ్లీచెర్‌ ముందే తెలిపారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌ దారిలో యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories